Rao Ramesh: ఏంటీ.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? షాక్‌కు గురిచేస్తున్న రావు రమేష్‌ పారితోషకం వార్త.

|

Aug 17, 2021 | 4:29 PM

Rao Ramesh Remuneration: రావు రమేష్‌ నటిస్తున్నాడంటే చాలు ఆ సినిమాలో పంచ్‌ డైలాగ్‌లకు కొదవ ఉండదని భావిస్తుంటారు సగటు సినీ ప్రేమికుడు. రావు గోపాలరావు లాంటి మహా నటుడి...

Rao Ramesh: ఏంటీ.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? షాక్‌కు గురిచేస్తున్న రావు రమేష్‌ పారితోషకం వార్త.
Rao Ramesh
Follow us on

Rao Ramesh Remuneration: రావు రమేష్‌ నటిస్తున్నాడంటే చాలు ఆ సినిమాలో పంచ్‌ డైలాగ్‌లకు కొదవ ఉండదని భావిస్తుంటారు సగటు సినీ ప్రేమికుడు. రావు గోపాలరావు లాంటి మహా నటుడి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రావు రమేష్‌. ఒక్కో సినిమాలో ఒక్కో అద్భుత పాత్రతో తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. పలు రకాల క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రల్లో నటిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్‌గామారింది. రావు రమేష్‌ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడనేది సదరు వార్త సారంశం.

వివరాల్లోకి వెళితే మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాయట్టు సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించేందుకు నిర్మాత అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో రావు రమేష్‌ను ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్‌ సంప్రదించారని సమాచారం. అయితే ఇందులో నటించడానికి రావు రమేష్‌ ఏకంగా రూ. కోటిన్నర తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఇంతలా రెమ్యునరేషన్‌ తీసుకోనుండడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సినిమాకే హైలెట్‌గా ఉండే ఈ పాత్రకు రావు రమేష్‌ అయితేనే న్యాయం చేస్తారని భావించిన చిత్ర యూనిట్‌.. ఆయన డిమాండ్‌ చేసిన రెమ్యునరేషన్‌ను ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే రావు రమేష్‌ అంతలా డిమాండ్‌ చేయడానికి మరో కారణంగా కూడా ఉందంటా.. అదే ఈ సినిమా కోసం ఎక్కువ కాల్షీట్లు ఇవ్వడమే. మరి మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే రావు రమేష్‌ ప్రస్తుతం సీటీమార్‌, పుష్ఫ, ఖిలాడీ, మహా సముద్రం, పక్కా కమర్షియల్‌, భీమ్లా నాయక్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Also Read: Rana Venkatesh: వెబ్‌ సిరీస్‌లో సందడి చేయనున్న బాబాయ్‌, అబ్బాయ్‌.. ఆ హీరోయిన్‌ రీ ఎంట్రీ ఇందులోనేనా?

Happy Birthday Shankar: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కెరీర్‏లో నేషనల్ అవార్డు అందుకున్న సినిమాలు ఇవే.

VJ Anandha Kannan: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ వీజే, నటుడు ఆనంద్ కణ్ణన్ కన్నుమూత..