AHA: ఈ అమ్మాయిలకు ఏది సూటిగా చెప్పడం రాదా.? ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ట్రైలర్‌.. ఆహాలో ఎప్పటి నుంచి రానుందంటే.

Taragati Gadi Dati AHA: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను, టాక్‌ షోలను పరిచయం చేస్తోంది 'ఆహా' ఓటీటీ. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా దూసుకొచ్చిన ఆహా.. అనతికాలంలోనే మంచి...

AHA: ఈ అమ్మాయిలకు ఏది సూటిగా చెప్పడం రాదా.? ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ట్రైలర్‌.. ఆహాలో ఎప్పటి నుంచి రానుందంటే.
Aha Taragati Gadi Dati
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2021 | 7:28 PM

Taragati Gadi Dati AHA: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను, టాక్‌ షోలను పరిచయం చేస్తోంది ‘ఆహా’ ఓటీటీ. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా దూసుకొచ్చిన ఆహా.. అనతికాలంలోనే మంచి ఆదరణను సంపాదించుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. ‘గరగతి గది దాటి’ అనే వెబ్‌ సిరీస్‌తో ఓ మంచి ప్రేమ కథను తీసుకురానుంది. హిందీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘ఫ్లేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌ను తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో తీసుకొస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను ఐదు ఎపిసోడ్స్‌గా విడుదల చేయనున్నారు. ‘పెళ్లిగోల’ ఫేమ్‌ మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో హ‌ర్షిత్ రెడ్డి, పాయ‌ల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ ‘ఆహా’ వేదికగా ఆగస్టు 20న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్‌ ప్రచరంలో వేగాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగానే వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ గమినిస్తే రాజమండ్రి నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథలా అనిపిస్తోంది. అమాయకమైన స్కూల్‌ ఏజ్‌ అమ్మాయి, అబ్బాయిల మధ్య కలిగే తొలి ప్రేమను దర్శకుడు అందంగా చూపించారు. కృష్ణ, జాస్మిన్‌ అనే ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది.? చిన్న తనంలో పుట్టిన వీరి ప్రేమ చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి అంశాలను ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించనున్నారు. ఇక దర్శకుడు ఈ సిరీస్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా చూసుకున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో వచ్చే ‘ఈ అమ్మాయిలకు ఏది సూటిగా చెప్పడం రాదా’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతను ఈ వెబ్‌ సిరీస్‌ ఎక్కువగా ఆకర్షించేలా కనిపిస్తోంది. మరి మరో అందమైన ప్రేమ కథగా వస్తోన్న తరగతి గది దాటి ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తూందో చూడాలి.

తరగతి గది దాటి ట్రైలర్‌..

Also Read: Hema Malini: ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో అసలేం జరుగుతోంది.? ఆవేదన వ్యక్తం చేసిన హేమామాలిని.

Rao Ramesh: ఏంటీ.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? షాక్‌కు గురిచేస్తున్న రావు రమేష్‌ పారితోషకం వార్త.

Rana Venkatesh: వెబ్‌ సిరీస్‌లో సందడి చేయనున్న బాబాయ్‌, అబ్బాయ్‌.. ఆ హీరోయిన్‌ రీ ఎంట్రీ ఇందులోనేనా?

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్