SR Kalyana Mandapam: ఆహాలో సందడి చేయనున్న ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం.. ఈ నెలలోనే స్ట్రీమింగ్‌ మొదలు..?

SR Kalyana Mandapam In AHA: ఎప్పటికప్పుడు కొత్త, కొత్త సినిమాలను తీసుకొస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే పలు వైవిద్య భరితమైన...

SR Kalyana Mandapam: ఆహాలో సందడి చేయనున్న ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం.. ఈ నెలలోనే స్ట్రీమింగ్‌ మొదలు..?
Sr Kalyanamandapam Ott
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2021 | 8:48 PM

SR Kalyana Mandapam In AHA: ఎప్పటికప్పుడు కొత్త, కొత్త సినిమాలను తీసుకొస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే పలు వైవిద్య భరితమైన సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను రూపొందించిన ఆహా ఓటీటీ.. ఇతర భాషలతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం చిత్రాన్ని ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. గతకొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. వెండి తెరపై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఆహా వేదికగా త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఆగస్ట్‌ 27 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ తర్వాత విజయాన్ని అందుకున్న తొలి చిత్రంగా ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం నిలిచింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయికుమార్ నటించిన విషయం తెలిసిందే. ఫుల్‌ లెంత్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ. 7 కోట్లకు పైగా వసూలు అందరి దృష్టిని ఆకర్షించింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ సంపాదించుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఆగస్ట్‌ 27 నుంచి స్ట్రీమింగ్‌ మొదలు విషయంపై ఆహా ఎప్పుడు అధికారికంగా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. ఈ ప్రాంతంలో మాత్రం..

Afghanistan Crisis: అఫ్గాన్ నుంచి పారిపోయినట్లే గతంలోనూ నాలుగుసార్లు చేతులెత్తేసిన అమెరికా! ఎక్కడెక్కడంటే..

RGV On Talibans: తాలిబన్లను సైతం వదలని రామ్‌ గోపాల్‌ వర్మ.. ట్వీట్‌ చూస్తే నవ్వు ఆపుకోలేరు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే