Animal: అడ్వాన్స్‌ బుకింగ్‌లో అదరగొడుతున్నరణ్‌బీర్ కపూర్ యానిమల్.. ఇప్పటివరకు ఎన్నికోట్లు వచ్చాయంటే?

రణ్‌ బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనాలు ఈ చిత్రాన్ని చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్‌ మూవీ టీజర్‌, ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. రణబీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలను తెరపై చూడాలని చాలామంది ఆత్రుతగా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్ లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది

Animal: అడ్వాన్స్‌ బుకింగ్‌లో అదరగొడుతున్నరణ్‌బీర్ కపూర్ యానిమల్.. ఇప్పటివరకు ఎన్నికోట్లు వచ్చాయంటే?
Animal Movie

Updated on: Nov 26, 2023 | 8:22 PM

రణ్‌ బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనాలు ఈ చిత్రాన్ని చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్‌ మూవీ టీజర్‌, ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. రణబీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలను తెరపై చూడాలని చాలామంది ఆత్రుతగా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్ లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యానిమల్‌ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తొలిరోజు వసూళ్ల గణాంకాలు బయటకు వచ్చాయి. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ యానిమల్ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌లో అదరగొడుతోంది. విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. యానిమల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి 24 గంటల్లోనే రూ. 3.4 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ నిపుణులు తరుణ్‌ ఆదర్శ్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు 52,500 టిక్కెట్లు అమ్ముడయ్యాయని, PVR INOX స్క్రీన్‌లలో 43,000, సినీపోలిస్‌లో 9,500 అమ్ముడయ్యాయని ఆయన తెలిపాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 1.2 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని, 3.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ‘యానిమల్’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ వస్తోంది. ‘యానిమల్’ సినిమా నవంబర్ 24న ఒక్క హైదరాబాద్ లోనే 46% బుక్ అయింది. సినిమా విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. అప్పటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అలాగే హీరోయిన్‌ రష్మిక మందన్నా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం, పైగా ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియెన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బెంగుళూరులో ‘యానిమల్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. చెన్నైలో కూడా థియేటర్ల జాబితాను ఇంకా ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి

24 గంటల్లోపే 50 వేలకు పైగా టికెట్లు సేల్..

సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.