
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ శుక్రవారం( డిసెంబర్ 1) గ్రాండ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్‌ని మాస్ అవతార్‌లో చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. యానిమల్ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. మొదటి రోజు ఎంత వసూళ్లు సాధిస్తుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రష్మిక మందన్న ‘యానిమల్’ మూవీలో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. రణబీర్ కపూర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి ‘యానిమల్’ సినిమాకు భారీ ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలోనే కాకుండా కన్నడ, తెలుగు, తమిళం తదితర భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాంతో యానిమల్‌పై సినీ ప్రేక్షకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇన్ని కారణాల వల్ల ఇండియాలో ఈ సినిమా మొదటి రోజు దాదాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.
టి-సిరీస్ సంస్థ ‘యానిమల్’ సినిమాకు భారీగా ఖర్చు పెట్టింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దుమ్మురేపింది. రణబీర్ కపూర్ మాస్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. యాక్షన్ సన్నివేశాలను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘యానిమల్’ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లో దుమ్మురేపుతోంది. బుధవారం (నవంబర్ 29) రాత్రి వరకు సుమారు 20 కోట్ల రూపాయల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్ రావడం గ్యారెంటీ అని అర్థమవుతోంది. సౌత్ ఇండియాలోనూ ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జరిగాయి. మహేష్ బాబు, ఎస్ఎస్. రాజమౌళి తదితరులు యానిమల్ టీమ్‌కు మద్దతుగా నిలిచారు.
#Xclusiv… #Animal 2.5 LACS… ADVANCES SHOULD JUMP TOMORROW 🔥🔥🔥… Advance booking status at *national chains*… Note: [Friday] Day 1 tickets sold…
⭐️ #PVRInox: 1,95,000
⭐️ #Cinepolis: 55,000
⭐️ Total: 2,50,000 tickets sold.#AnimalTheFilm pic.twitter.com/blaWTxR5Lx— taran adarsh (@taran_adarsh) November 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.