Animal: ‘యానిమల్ సినిమా ఆయన బయోపిక్’.. అసలు విషయం చెప్పేసిన రణబీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించాడు సందీప్. కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే టక్కున చెప్పే పేరు యానిమల్. ఈ సినిమా పేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి యానిమల్ పై అంచనాలు మొదలయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించాడు సందీప్. కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు సందీప్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. యానిమల్ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి గ్లింప్స్, టీజర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇక యానిమల్ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి గెస్ట్ లుగా హాజరుకానున్నారు.
యానిమల్ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో యానిమల్ టీమ్ సందడి చేసింది. ఇదిలా ఉంటే చెన్నై ఈవంట్ లో హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు’. అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి బయోపిక్ అనుకున్నా ఇన్ని రోజులు కాదు యానిమల్ సినిమా సందీప్ రెడ్డి బయోపిక్ అని అన్నాడు రణబీర్ కపూర్. సందీప్ ఎగ్రెసివ్ పర్సన్ నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది అని అన్నారు రణబీర్ కపూర్.
Guys….. check this out https://t.co/oTHBRw8oMt
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




