
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపూల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రణబీర్ కపూర్, అలియా భట్. ఇద్దరూ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రణబీర్.. ఇప్పుడు యానిమల్ 2 కోసం రెడీ అవుతున్నారు. అలియా, రణబీర్ కపూర్ వివాహం చేసుకుని మూడు సంవత్సరాలు అయింది. ఈ జంటకు రాహా అనే పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ కపుల్ ఇప్పుడు చాలా విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటి నిర్మాణం చివరి దశలో ఉంది. ఆ ఇంటికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..
రణబీర్ కపూర్, అలియా భట్ ముంబైలోని సంపన్న ప్రాంతంగా పిలువబడే బాంద్రాలోని పాలి హిల్స్‌లోని వారి పూర్వీకుల భూమిలో ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించారు. అక్కడ గతంలో కృష్ణరాజ్ బంగ్లా ఉండేది. ఈ కొత్త ఇల్లు రణబీర్ కపూర్, అలియా భట్ కుమార్తె రహా పేరు మీద రిజిస్టర్ చేయించారు. రణబీర్-ఆలియా నిర్మించిన ఇంటి విలువ దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ విలాసవంతమైన ఇంట్లో అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. రణబీర్, ఆలియా ప్రపంచంలోని అత్యుత్తమ పదార్థాలను ఉపయోగించి ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటికి అత్యుత్తమ టైల్స్, ఫర్నిచర్, అలంకరణ దీపాలు, సోఫాలు తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
ఆ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, కూతురికి ప్లే రూమ్, రణబీర్ కపూర్ కోసం గేమ్ జోన్, ప్రైవేట్ సినిమా, ఆఫీస్, ప్రైవేట్ బార్, పెద్ద గ్యారేజ్, లైబ్రరీ ఉన్నాయి. ఈ ఇంటి లిఫ్ట్ కూడా కార్లను పైకి తీసుకువెళుతుంది. గేటు లోపలికి వెళ్లే కారు నేరుగా లిఫ్ట్ ద్వారా ఇంటి హాలుకు వెళుతుంది. అదనంగా, ఈ ఇంటికి అత్యుత్తమ భద్రతా వ్యవస్థ ఉంది. రెండు రోజుల క్రితం ఈ ఇంటి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అయింది. ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్ వీడియోలో కనిపించింది. దీంతో అలియా కాస్త కఠినంగానే స్పందించింది.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
Alia, Ranbir House
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..