‘రణరంగం’ రివ్యూ : శర్వా వన్ మ్యాన్ షో!

నటీనటులు : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ సంగీతం : ప్రశాంత్ పిళ్ళై సినిమాటోగ్రఫర్ : దివాకర్ మణి విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్‌. ఓ చిన్న క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్టయి..హీరోగా మారి..తన సినిమా వస్తుందంటే ఓ సపరేట్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సారి ‘రణరంగం’తో గ్యాంగ్‌స్టర్‌గా మారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇందులో శర్వా 25 ఏళ్ల కుర్రాడిగా, 45 ఏళ్ల వ్యక్తిగా కనిపించారు. […]

‘రణరంగం’ రివ్యూ : శర్వా వన్ మ్యాన్ షో!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 17, 2019 | 12:35 PM

నటీనటులు : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ

సంగీతం : ప్రశాంత్ పిళ్ళై

సినిమాటోగ్రఫర్ : దివాకర్ మణి

విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్‌. ఓ చిన్న క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్టయి..హీరోగా మారి..తన సినిమా వస్తుందంటే ఓ సపరేట్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సారి ‘రణరంగం’తో గ్యాంగ్‌స్టర్‌గా మారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇందులో శర్వా 25 ఏళ్ల కుర్రాడిగా, 45 ఏళ్ల వ్యక్తిగా కనిపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శర్వాకు హిట్‌ ఇచ్చిందా? యువ దర్శకుడు సుధీర్‌ వర్మ మరోసారి మ్యాజిక్‌ చేశాడా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1995లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రోజులవి. బ్లాక్ టికెట్ల దందా చేస్తూ చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేసే యువకుడు దేవా (శర్వానంద్). స్నేహితులతో కలిసి తన లైఫ్ బతికేస్తుంటాడు. ఆ ఊళ్లో ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ)కు చాలా బిజినెస్‌లు ఉంటాయి. అందులో ఒకటి లిక్కర్ బిజినెస్ కూడా. దాంతో తన స్నేహితులతో కలిసి దేవా ఒరిస్సా నుంచి మందు తెచ్చి అమ్ముతాడు. అప్పుడే గీత (కళ్యాణి ప్రియదర్శన్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే వీళ్లు చేస్తున్న బిజినెస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోతాడు దేవా. ముఠాల పోరులో మాఫియా డాన్ అవుతాడు దేవా. అక్రమ మద్య రవాణా కాస్తా పెద్ద సామ్రాజ్యంగా మారుతుంది. ఆ క్రమంలోనే జీవితంలో అన్నీ కోల్పోయిన దేవా.. తన కుటుంబంతో కలిసి స్పెయిన్ వెళ్లిపోతాడు. అక్కడే డాక్టర్ (కాజల్ అగర్వాల్)ను కలుస్తాడు. చివరికి దేవని చంపటానికి ప్రయత్నం చేస్తోన్న వాళ్లు ఎవరు ? ఇంతకీ ఓ సామాన్య కుర్రాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండితెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

‘గాడ్‌ఫాదర్‌’ మూవీ చూసి స్ఫూర్తి పొంది మణిరత్నం, రామ్‌గోపాల్‌ వర్మ నుంచి చాలా మంది దర్శకులు సినిమాలు తీశారు. అందులో ‘రణరంగం’ ఒక్కటి. ఈ సినిమాను చాలా సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీశానని దర్శకుడు సుధీర్ వర్మ ముందుగానే చెప్పాడు. ఈ సినిమా 1990 కాలంలోనూ, ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారంగా సాగుతూ..  అక్కడక్కడ వచ్చే కొన్ని భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే శర్వానంద్ యాక్టింగ్..అతని  క్యారెక్టర్ లోని షేడ్స్, శర్వానంద్ – కల్యాణి ప్రియదర్శన్ మధ్య కెమిస్ట్రీ, సాంగ్స్ ఓకే. ఇక ఈ సినిమాలో ఆవేశంగా ఉండే దేవ పాత్ర‌కు శర్వానంద్ ప్రాణం పోసాడు. ఓల్డ్ ఏజ్ పాత్రలో కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాలోనే శర్వానంద్ హైలెట్ గా నిలిచాడు. ఒక రకంగా సినిమా శర్వా..వన్ మ్యాన్ షో అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సుధీర్ వర్మ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు, ఇంటర్వెల్ లాంటి యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నా.. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి. పైగా సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లుపెద్దగా లేవు.

సాంకేతిక విభాగం :

సుధీర్ వర్మ తీసుకున్న కధాంశం బాగున్నా దానిని తెరపై చూపించడంలో కాస్త శ్రద్ద వహిస్తే సినిమా మరోవిధంగా ఉండేది.  సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.  కథ 1995 కాలం నుంచి మొదలౌతుంది కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చూపించాలి.  వాటిని చక్కగా చూపించారు దివాకర్ మణి.  ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ బాగుంది.  కళా దర్శకుడి ప్రతిభకు ఈ మూవీ అద్దం పట్టిందని చెప్పాలి.

రణరంగం: శర్వా వన్ మ్యాన్ షో.

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.