హైదరాబాద్ : మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు హీరో నాని. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన 73వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నేచురల్ స్టార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించిందని చెప్పిన నాని..తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయన్నాడు. ఈ కార్యక్రమంలో 200 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.
Happy Independence Day 🇮🇳❤️ pic.twitter.com/EEWhA9v85a
— Nani (@NameisNani) August 15, 2019