Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vyooham Teaser: ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించేలా వ్యూహం టీజర్

ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహం టీజర్ విడుదలయ్యింది. వైఎస్సార్ హెలికాప్టర్‌ ప్రమాదంతో టీజర్ మొదలైంది. జగన్ కుటుంబీకుల కన్నీరు, చంద్రబాబు కళ్లలో ఆనందాన్ని చూపించారు ఇందులో.....

Vyooham Teaser:  ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించేలా వ్యూహం టీజర్
'vyooham' Movie Teaser
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 24, 2023 | 11:32 AM

పుండుపైన కారం.. బొబ్బలెక్కిన ఆగ్రహం.. అందుకు ప్రతీకారమే వ్యూహం అంటూ తను తీస్తున్న సినిమాపై ఫుల్‌ హైప్‌ పెంచేశారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. వ్యూహం మూవీ ఎవరి బయోపిక్‌ కాదూ.. సీక్వెల్‌ అంతకన్నా కాదు.. పొలిటికల్ కుట్రల విషం ఉంటుందని కథను కాస్త రివీల్ చేశారు. అయితే కుట్రలు ఎవరు చేశారు..? వాటికి ఎవరు బలయ్యారనేది మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంతలోనే సీఎం జగన్‌ను రెండోసారి ఆర్జీవీ కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక వ్యూహం స్టిల్స్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన ఆర్జీవీ.. పూర్తి స్థాయి సినిమాతో ఇంకెంత దుమారం రేపుతారో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌ను మరోసారి కలిశారు రాంగోపాల్‌వర్మ. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో గంటపాటు సమావేశమయ్యారు. ఆంధ్రా పాలిటిక్స్‌పై వర్మ తీస్తున్న వ్యూహం చిత్రంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. 30శాతం చిత్రీకరణ పూర్తవ్వడంతో జగన్‌కు సీన్స్ చూపించారు వర్మ. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి నుంచి వర్మ స్పష్టత తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని సీన్స్ చిత్రీకరణ ఎలా ఉండాలనేదానిపై సలహాలు తీసుకున్నట్టు సమాచారం. సినిమా బయోపిక్‌ కాదు… రియల్‌ పిక్చర్‌ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వర్మకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. సీఎం జగన్‌ బయోపిక్‌గా జరుగుతోన్న ప్రచారాన్ని కూడా ఖండించాలని గట్టిగా చెప్పారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సీఎం జగన్ తో భేటీ కావడంతో ఖచ్చితంగా ప్రతిపక్షాలను సినిమాలో ఎండగడతారని ప్రచారం మాత్రం జోరందుకుంది.

సీఎంతో భేటీ తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మాట్లాడారు ఆర్జీవీ. సినిమా 30శాతం కంప్లీట్ అయిందన్నారు. ఆర్జీవీ అంటేనే కాంట్రవర్శీకి కేరాఫ్‌. ఆయన మాటలు, చేతలు, సినిమాలు..ఇలా ఏం చేసినా వివాదమే. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు ఎంత కాంట్రవర్సీ సృష్టించాయో… అంతకుమించి వ్యూహం మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటిది వ్యూహం, రెండోది శపథం పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా స్టిల్స్‌ను వర్మ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మూవీ బయోపిక్ కాదని, రియల్ పిక్ అంటున్నారు ఆర్జీవీ. టీజర్‌తోనే సినిమాలో ఏదో ఉందనే లీకులిచ్చి తనదైన మార్క్‌ చాటుకున్నారు.

ఫస్ట్ పార్ట్‌ వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే సెకండ్ పార్ట్ శపథంతో మరో షాక్ ఇస్తానంటున్నారు ఆర్జీవీ. వంగవీటి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన దాసరి కిరణ్ వ్యూహం, శపథం చిత్రాలను నిర్మిస్తున్నారు. మొత్తంగా వ్యూహం స్టిల్స్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన ఆర్జీవీ పూర్తి స్థాయి సినిమాతో పొలిటికల్ దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..