Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్సా మజాకా.. దెబ్బకు ట్విట్టర్ డీ యాక్టివేట్ చేసిన స్టార్ లిరిసిస్ట్
సర్కారు వారి పాట సినిమా హిట్ గా నిలిచినా మహేష్ అభిమానులకు అది సరిపోలేదనే చెప్పాలి. దాంతో ఇప్పుడు ఆయన నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక గుంటూరు కారం సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన దాని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు అభిమానులు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరుకారం. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట సినిమా హిట్ గా నిలిచినా మహేష్ అభిమానులకు అది సరిపోలేదనే చెప్పాలి. దాంతో ఇప్పుడు ఆయన నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక గుంటూరు కారం సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన దాని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ ఊపుమీదే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
గుంటూరు కారం మొదటి సాంగ్ దమ్ మసాలా సాంగ్ విశేష ఆదరణ అందుకుంది. ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. రీసెంట్ గా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆయితే ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అంతే కాదు ఈసాంగ్ కేవలం 2 నిముషాలు మాత్రమే ఉండటంతో అభిమానులు నిరాశపడ్డారు.
పైగా తమన్ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. దాంతో ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు. సోషల్ మీడియాలో సాంగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ లో కొంతమందికి కౌటర్ ఇచ్చారు. సాంగ్ కు ఏం తక్కువైంది.. టైం తప్ప .. ప్రతివాడు మాట్లాడేవాడే అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. దాంతో ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. మహేష్ బాబు సినిమా కు ఇలాంటి సాంగ్ ఏంటి.? నిరాశపరిచారు.. మీ నుంచి ఇలాంటిది ఎక్స్ పెట్ చేయలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఆ సాంగ్ ఎఫెక్ట్ అనుకుంట.. రామ జోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశారు. ఆయన ట్విట్టర్ ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఇదిలా ఉంటే త్వరలోనే గుంటూరు కారం సినిమానుంచి మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Calling it a day with @avigowariker! 📸 #PostPackupShot pic.twitter.com/IWudnEmG4V
— Mahesh Babu (@urstrulyMahesh) December 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.