Ashokavanamalo Arjuna Kalyanam: అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి మరో లిరికల్ సాంగ్..

ఫ‌ల‌క్‌నుమా దాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).

Ashokavanamalo Arjuna Kalyanam: అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి మరో లిరికల్ సాంగ్..
Vishwak Sen

Updated on: Apr 01, 2022 | 6:34 AM

ఫ‌ల‌క్‌నుమా దాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ప్రస్తుతం ఈ యంగ్ హీరో క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటేస్ట్ చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం (Ashokavanamalo Arjuna Kalyanam). ఇందులో విశ్వక్ సరసన రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌‏గా నటిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న‌ విడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ‘రామ్ చిలక..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

ఉరికే నా సిల‌కా నీ స‌క్క‌నైన పాట మెళిక‌.. గ‌ట్టు దాటి పుట్ట దాటి.. ఏడేడు ఏర్లు దాటి.. కొండా దాటి కోన దాటి .. కోసు కోసు దార్లు దాటి.. సీమా సింత నీడ‌కొచ్చానె రంగు రంగు రామ్ చిల‌క సింగ‌రాల సోకులు చూశానె.. అంటూ సాగే ఈ పాటను అల్లం అర్జున్ కుమార్ తనకు కాబోయే భార్య గురించి పాట పాడుకుంటున్నాడు. ఈ పాటను జె క్రిష్ సంగీతం అందించిన ఈ పాటను విజయ్ కుమార్ భల్లా, రవి కిరణ్ కోలా రాశారు. రవి కిరణ్ కోలా పాటను పాడారు. జానపదం స్టైల్లో పాట ఉంది. ఇందులో విశ్వక్ సేన్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన పాట‌ల‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read: Ram Charan: జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న మెగాపవర్ స్టార్

Jana Gana Mana: ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఆకట్టుకుంటున్న ‘జన గణ మన’ వీడియో

RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. స్ర్కీన్‌ ముందు ఫ్యాన్స్‌ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..

RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..