
ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్నాయి. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతున్నాయి. ఇక తెలుగులో చాలా సినిమాలు ఇతర భాషల్లోనూ దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినిమాల డిమాండ్ బాగా పెరిగిపోయింది. తెలుగులో రిలీజ్ అయినా సినిమాలు దాదాపు హిందీలోనూ విడుదలై బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. కాగా తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిందీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగులో డిజాస్టర్ అయిన ఓ సినిమా మాత్రం హిందీలో దుమ్ము రేపింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక రీసెంట్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అంతకు మందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.
అయితే ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ హిందీలో మాత్రం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా హిందీ వర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. తెలుగులో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.