Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన కిక్ తో వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డబల్ దిమాక్ పోరడు. అప్పటి వరకు చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ ను మాస్ హీరోగా మార్చడు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. న్యూ లుక్ .. నయా బాడీ లాంగ్వేజ్ తో ఉరమాస్ హిట్ అందుకున్నాడు ఈ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాతర్వాత రామ్. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. తన కెరీర్ లో మొదటి సారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాకూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు బైలింగ్వల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. చేసిన ఒక్క సినిమాతో ఈ బ్యూటీ యమా క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా కూడా ఫుల్ ఎనర్జిటిక్ కథతో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఉస్తాద్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇదే టైటిల్ దాదాపు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ ను అభిమానులంతా ముద్దుగా ఉస్తాద్ అని పిలుచుకుంటున్నారు. అందుకే అదే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :