
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకున్నా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రామ్ పోతినేని. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ తెలంగాణ కుర్రాడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో రామ్ క్రేజ్ పెరిగింది. ఆతర్వాత రామ్ నటించిన రెడ్, వారియర్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో స్కంద అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో రామ్ పక్కా హిట్ అందుకుంటాడు అంటున్నారు ఫ్యాన్స్.
స్కంద సినిమాను బోయపాటి తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీలో రామ్ రెండు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అయితే రామ్ కు ఇండియన్ క్రికెటర్ కోహ్లీకి పోలికలు ఉంటాయి. దీని గురించి రామ్ మాట్లాడుతూ..
బాలీవుడ్ లో ఇంటర్వ్యూ ఇస్తూ.. చాలా మంది కోహ్లీలా ఉన్నారు భవిష్యత్ లో కోహ్లీ బయోపిక్ చేస్తారా అని ప్రశ్నించగా.. చాలా మంది కోహ్లీ బయోపిక్ చేస్తారా అని అడిగారు. అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ తప్పకుండా చేస్తా అని తెలిపారు రామ్. ఇస్మార్ట్ శంకర్ కోసం కొత్త లుక్ ను ట్రై చేశాం.. అప్పటి నుంచి కోహ్లీతో పోల్చుతున్నారు అని అన్నారు రామ్. ఇప్పటివరకు చాలా యాక్షన్ సినిమాలు చేశా.. కానీ స్కంద లాంటి యాక్షన్ సినిమా చేయలేదు అని అన్నారు రామ్. స్కంద సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు రామ్.
రామ్ పోతినేని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.