Ram Gopal Varma: నాలిక కరుచుకున్న వర్మ.. అలాంటి ఉద్దేశం లేదంటూ మరో ట్వీట్..

కాంట్రవర్సీకి మరో పేరుగా నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి అనుచిత కామెంట్స్‌ చేశారు. ఈసారి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశారు.

Ram Gopal Varma: నాలిక కరుచుకున్న వర్మ.. అలాంటి ఉద్దేశం లేదంటూ మరో ట్వీట్..
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2022 | 6:18 PM

కాంట్రవర్సీకి మరో పేరుగా నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) మరోసారి అనుచిత కామెంట్స్‌ చేశారు. ఈసారి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటూ ఆయన అభ్యంతరకరమైన ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వర్మ ట్వీట్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రామ్‌గోపాల్‌ వర్మపై బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, నందీశ్వర్‌ గౌడ్‌ అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

వర్మ ఒక వేస్ట్‌ ఫెలో అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. తాము ఫిర్యాదుపై పోలీసులు కచ్చితంగా చర్య తీసుకుంటారని అన్నారు. గిరిజన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. మరో వైపు తాను చేసిన ట్వీట్‌ తీవ్రస్థాయిలో వివాదం కావడంతో నాలిక కరుచుకున్న వర్మ మరో ట్వీట్‌తో వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. తనకు ఎటువంటి దురుద్దేశం లేదని, మహాభారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని మరో ట్వీట్‌ చేశారు. ద్రౌపది అనే పేరు చాలా అరుదుగా ఉంటుందని, ఆ పేరు వినగానే ఆ పేరుతో ముడిపడిన ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎవరి సెంటిమెంట్‌ గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు. వర్మ కామెంట్స్‌పై హీట్‌ పెరుగుతూనే ఉంది. లక్ష్మణరేఖ దాటొద్దని హెచ్చరించారు బీజేపీ ఎంపీ GVL. రాష్ట్రపతి అభ్యర్థిపై చౌకబారు విమర్శలు తగవన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని.. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సూచించారాయన.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి