Nandamuri Balakrishna: టాలీవుడ్‌లో కోవిడ్ కల్లోలం.. నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

టాలీవుడ్ లో కరోనా కల్లోలం మళ్ళీ మొదలైంది. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కు కరోనా పాజిటివ్

Nandamuri Balakrishna: టాలీవుడ్‌లో కోవిడ్ కల్లోలం.. నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2022 | 6:02 PM

టాలీవుడ్ లో కరోనా కల్లోలం మళ్ళీ మొదలైంది. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలతో బాలకృష్ణ కు కరోనా అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాలయ్య హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవలే బాలయ్య బసవతారకం హాస్పటల్ 22వ వార్షికోత్సవం లో పాల్గొన్నారు. బాలయ్యకు పాజిటివ్ అని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య.

నందమూరి బాలకృష్ణ తనకు కరోనా పాజిటివ్ అని తెలిపారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తెరిగి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి