AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: చరణ్‌కు పెట్టిన ప్రేమ పరీక్ష అదే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగా కోడలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిందే. ఎప్పుడూ ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా చరణ్, చిరంజీవి, క్లీంకార గురించి ఎప్పటికప్పుడు నెట్టింట పోస్ట్ చేస్తుంటారు ఉపాసన.

Upasana Konidela: చరణ్‌కు పెట్టిన ప్రేమ పరీక్ష అదే.. ఆసక్తికర విషయం చెప్పిన మెగా కోడలు
Ram Charan , Upasana
Rajeev Rayala
|

Updated on: Aug 11, 2025 | 8:02 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు చరణ్, క్లింకారకు సంబంధించిన ఫోటోస్, మూవీ అప్డేట్స్ పై షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆక్టట్టుకుంటారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు ఆమెను కో ఛైర్మన్‌ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం హోమ్ టూర్ నిర్వహించారు. ఈ హోమ్ టూర్ లో అనేక విషయాలను పంచుకున్నారు మెగా కోడలు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఫుడ్ లవర్స్ అని తెలిపారు. అలాగే చరణ్ ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద రెస్టారెంట్ కు వెళ్లినా కూడా నాకు ఇండియన్ ఫుడ్ కావాలి అని అడుగుతాడు. తన ఫుడ్ లో ఒక్కటైనా సరే ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే.. చరణ్ ఎక్కువగా స్పైసి ఫుడ్ తింటాడు. రసం అన్నం అంటే అతనికి చాలా ఇష్టం అని తెలిపారు ఉపాసన.

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

ఇక ప్రేమలో ఉన్నప్పుడు చరణ్ కు ఓ ప్రేమ పరీక్షా పెట్టాను అని చెప్పుకొచ్చారు ఉపాసన. తాను నిజంగా తనని ప్రేమిస్తే హైదరాబాద్ లోని ఛార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరకు కి తీసుకెళ్లాలని ఓ పరీక్ష పెట్టా.. తాను నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. కానీ అక్కడ అందరూ చరణ్ ను గుర్తుపట్టేశారు. ఒక్కసారిగా మీద పడిపోయారు. ఇది అతనికి నిజమైన లవ్ టెస్ట్ అని సరదాగా చెప్పారు ఉపాసన .. తమది మగధీర సినిమాలోలా చేతులు తగలగానే షాక్ వచ్చే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు అని ఆమె అన్నారు ఉపాసన. చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..