Upasana: అమెరికాలో డెలివరీ అంటూ పుకార్లు.. స్పందించిన మెగా కోడలు ఉపాసన.. ఏమన్నారంటే?

ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మెగా కోడలు విదేశాల్లో డెలివరీకి ప్లాన్‌ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు రూమర్లు సృష్టించారు. ఇందుకు కారణమూ లేకపోలేదు.

Upasana: అమెరికాలో డెలివరీ అంటూ పుకార్లు.. స్పందించిన మెగా కోడలు ఉపాసన.. ఏమన్నారంటే?
Ram Charan Wife Upasana

Updated on: Mar 01, 2023 | 6:30 AM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మనాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కానుండడంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతోంది. ఇటీవల ఉపాసన స్నేహితులు ఆమెకు గ్రాండ్‌గా సీమంతం కూడా నిర్వహించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుని మురిసిపోయింది ఉప్సీ. అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మెగా కోడలు విదేశాల్లో డెలివరీకి ప్లాన్‌ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు రూమర్లు సృష్టించారు. ఇందుకు కారణమూ లేకపోలేదు. ఇటీవలే ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోషియేషన్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్‌చరణ్‌ అమెరికా వెళ్లారు. ప్రముఖ అమెరికన్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట‍్లాడుతూ.. ‘ఉపాసన కొన్ని రోజులపాటు ఇక్కడే ( అమెరికా) ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. ‘మీ ఫస్ట్‌ బేబీని డెలివరీ చేయడమంటే తనకు ఎంతో గౌరవం.. ఎక్కడైనా అందుబాటులో ఉండమన్నా నేను సిద్ధం’ అని తెలిపారు. దీంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం బాగా సాగింది. తాజాగా ఈ పుకార్లు ఉపాసన వరకు వెళ్లాయి. దీంతో సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆమె అవన్నీ రూమర్లేనని కొట్టి పారేసింది. ట్విట్టర్‌ ద్వారా తన ప్రసవానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది.

రామ్‌చరణ్‌-ఆస్టన్‌ల సంభాషణకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఉపాసన.. ‘డాక్టర్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ మీరు సో స్వీట్‌. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్‌ కుటుంబంలో భాగమవ్వండి. ఇక్కడి వైద్యులు సుమన మనోహర్‌, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’ అని తన డెలివరీపై వస్తోన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిందీ మెగా కోడలు. కాగా ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్‌ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసిందిప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు’ ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..