Ram Charan: ఒకే షర్ట్‌ను 8 ఏళ్లుగా ధరిస్తున్న రామ్ చరణ్.. ఇంతకీ ఆ షర్ట్ స్పెషాలిటీ ఏంటో ?..
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని.. ఎంతో మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు చరణ్ సినిమాల కోసం విదేశీయులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటనపరంగానే కాదు.. చరణ్ వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అసలు పరిచయమే అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను, విమర్శలను ఎదుర్కొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని.. ఎంతో మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు చరణ్ సినిమాల కోసం విదేశీయులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటనపరంగానే కాదు.. చరణ్ వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. స్టార్ హీరో వారసుడు.. మరోవైపు బాబాయ్ కూడా పెద్ద హీరో.. అయినా ఎంతో ఒదిగి ఉంటాడు చరణ్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాదిరిగానే చరణ్ కూడా ఎంతో సింపుల్ గా కనిపిస్తూ.. తన అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ విషయాన్ని ఇప్పుడు నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. స్టార్ హీరో అయినా.. చరణ్ సింప్లిసిటీ చూసి మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా.
ఇటీవల డైరెక్టర్ బుబ్చిబాబుతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో చరణ్ గ్రీన్ గ్రే కలర్ చెక్ షర్ట్ వేసుకొని కనిపించారు. అయితే అదే షర్ట్ ను గతంలో పలుమార్లు ధరించి కనిపించారు చరణ్. 2016లో ‘ధృవ’ సినిమాలోనూ అదే షర్ట్ ధరించి కనిపించారు చెర్రీ. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో..ప్రమోషన్స్ సమయంలోనూ అదే షర్ట్ ధరించి కనిపించారు. అలాగే లాక్ డౌన్ సమయంలోనూ అదే షర్ట్ చాలా సార్లు ధరించి కనిపించారు. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఒకే షర్ట్ ను చరణ్ పదే పదే ఉపయోగిస్తూ కనిపించడంతో ఆ షర్ట్ అంటే చెర్రీకి ఎంతో ఇష్టమని అర్థమవుతుంది.
View this post on Instagram
ఇప్పటివరకు చరణ్ ఎన్నిసార్లు ఆషర్ట్ ధరించాడో తెలుపుతూ ఫోటోస్ అన్నింటిని ఒక్కచోటికి చేర్చి మీమ్స్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2016, 2020, 2021, 2022, 2024 వరకు చరణ్ అదే షర్ట్ పలుమార్లు ధరించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట పంచుకుంటున్నారు ఫ్యాన్స్. బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే అబ్బాయి చరణ్ కూడా ఎంతో సింపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.