
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చెర్రీ. సినిమా సినిమాకు నటనలో పరిణితి చూపిస్తూ.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక వరుస సినిమాలతో ఈ యంగ్ హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో అల్లూరు సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. శంకర్ – చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించగానే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని కూడా అంటున్నారు.
ఈ సినిమా శంకర్ శైలిలో సందేశాత్మక అంశాలతో రూపొందే కమర్షియల్ చిత్రం అని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇది ‘ఒకే ఒక్కడు’ తరహాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. ఇందులో చరణ్ పొలిటీషియన్ గా నటిస్తారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. రెండు పాత్రలనూ శంకర్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని అంటున్నారు. గతంలో చరణ్ ‘నాయక్’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో మరోసారి శంకర్ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక సెప్టెంబర్ లో శంకర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Kamal Haasan : షూటింగ్ రీ స్టార్ట్ చేసిన విశ్వనటుడు.. విలన్ గా మక్కల్ సెల్వన్..