Ram Charan-Jr NTR: ఎన్టీఆర్‌ను నడుముపై గిల్లిన చరణ్.. తారక్ రియాక్షన్ చూడండి

|

Dec 11, 2021 | 3:11 PM

ఆర్.ఆర్.ఆర్ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది.

Ram Charan-Jr NTR: ఎన్టీఆర్‌ను నడుముపై గిల్లిన చరణ్.. తారక్ రియాక్షన్ చూడండి
Ram Charan Jr Ntr
Follow us on

ఆర్.ఆర్.ఆర్ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఈ క్రమంలో రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అయితే ఈ ప్రెస్ మీట్స్‌లో తారక్, చరణ్ బాండింగ్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు నందమూరి, మెగా హీరోల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉండేది. ఇప్పటికీ ఏపీలోని రెండు, మూడు జిల్లాల్లో ఈ ఫ్యాన్ వార్ కొనసాగుతోంది. మా వాడి కలెక్షన్స్ ఎక్కువ అంటే.. మా వాడికి ఎక్కువ అని ఫ్యాన్స్ వీరంగం సృష్టించేవారు. కొన్నిసార్లు ఘర్షణలు కూడా జరిగేవి. అయితే ఇప్పుడిప్పుడు ఈ అంతరాలు తగ్గిపోయాయి. ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈ డిఫరెన్సెన్స్‌ను మటుమాయం చేసే అవకాశం కనిపిస్తుంది. అందరూ అభిమానులు కలిసి మేము తెలుగు సినిమా ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పేలా ఆర్.ఆర్.ఆర్ మార్పు తెచ్చే అవకాశాలు ఛాన్సస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అవును.. తారక్, చరణ్..  సెట్స్‌లో చిన్నపిల్లల్లా దెబ్బలాడుకున్నారని.. పెళ్లయి.. పిల్లలు పుట్టినా… కోట్ల మంది అభిమానులు ఉన్నా వాళ్ల అల్లరి మాములుగా లేదంటూ కామెంట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. వాళ్ల మధ్య ఉన్న స్నేహం, బాండింగ్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందని.. లేదంటే కష్టం అయ్యేది ఆయన అన్నారు.  ఆలియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అదే విషయం ప్రెస్‌మీట్లలో కూడా స్పష్టమవుతుంది. చెర్రీ, ఎన్టీఆర్ ఒకరిపై.. ఒకరు పంచ్‌లు వేసుకుంటున్నారు. గిల్లుకుంటున్నారు.. అల్లరి.. అల్లరి చేస్తున్నారు. ఈ సీన్ చూస్తే ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. తాజాగా తెలుగు ప్రెస్‌మీట్‌లో కూడా అలాంటి సీనే జరిగింది. ఫోటోలకు ఫోజులు ఇచ్చే సందర్భంలో.. ఎన్టీఆర్ న‌డుం మీద గిల్లాడు చరణ్. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిప‌డి నవ్వుతూ పక్కకు జరిగాడు తారక్. ఈ టీజింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.  ఈ వీడియోను టాలీవుడ్ కమెడియ‌న్ వెన్నెల కిషోర్ షేర్ చేసి.. న‌వ్వుతున్న ఎమోజీని జతచేశాడు. ఈ వీడియో చూసిన మెగా, నందమూరి ఫ్యాన్స్ తెగ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీలో  కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు.  అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్, శ్రేయ, రాజీవ్ కనకాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.  బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో..ఆర్.ఆర్.ఆర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: నదిపై తేలియాడుతూ వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్