Ram Charan: శరవేగంగా శంకర్ సినిమా షూటింగ్.. వైజాగ్ బీచ్‌లో రామ్ చరణ్

|

May 06, 2022 | 8:28 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ , ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరిసీతారామరాజుగా కనిపించి ఆకట్టుకున్న చరణ్.

Ram Charan: శరవేగంగా శంకర్ సినిమా షూటింగ్.. వైజాగ్ బీచ్‌లో రామ్ చరణ్
Ram Charan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవలే ఆర్ఆర్ఆర్(RRR), ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరిసీతారామరాజుగా కనిపించి ఆకట్టుకున్న చరణ్. ఆచార్య సినిమాలో సిద్ద పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు చరణ్. ప్రస్తుతం ఈ మెగా పవర్ స్టార్ టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన కనిపించనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన  నాలుగు షెడ్యూల్స్ ను పూర్తిచేశారు దర్శకుడు శంకర్. తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఆర్కే బీచ్ లో చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను షూట్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..