RRR Movie: రిలీజ్ డేట్లు మారిపోయినా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నారు మేకర్స్. అనుకోకుండా దొరికిన బ్రేక్‌ని టూ ఇంటిలిజెంట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారు. సెకండ్ టైమ్ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో డిజైన్ చేసుకుని తమ సినిమాల్ని సక్సెస్ దిశగా నడిపించుకుంటున్నారు. మరి.. జక్కన్న వ్యూహమేంటి. ట్రిపులార్ సెకండ్ ఫేజ్ ఎలా వుండబోతోంది…? కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేది జక్కన్నకుండే మొండి ధైర్యం. సినిమా మేకింగ్ నుంచి ప్రమోషన్ దాకా దర్శకధీరుడికంటూ.. ఒక స్టయిల్ వుంటుందనేది క్లియర్. సంక్రాంతి సీజన్‌ని మిస్సయ్యామన్న చిన్న డిజప్పాయింట్ తప్పితే తన సినిమా మీద రాజమౌళి దగ్గర నైతిక స్థైర్యం తగ్గనే లేదు. కాకపోతే… ప్రమోషన్‌కి పెద్దగా టైమ్ లేదు. మార్చి లాస్ట్ వీకెండ్‌లోనే రాబోతోంది ట్రిపులార్ మూవీ. కేవలం రెండేరెండు వారాల్లో ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్‌ని ప్రమోట్ చేయడమంటే మాటలు కాదు.
ఇద్దరు హీరోలతో మ్యూచ్యువల్‌గా చేసిన దోస్తీ పాట, ఇండివిడ్యువల్ ప్రమోషనల్ సాంగ్స్, బోనస్‌గా జననీ థీమ్ సాంగ్, ఫైనల్‌గా పవర్‌ఫుల్ ట్రైలర్… అన్నీ ఫస్ట్ ఫేస్‌లోనే బైటికొచ్చేశాయి. అందుకే… ఫ్యాన్స్‌కి న్యూ ఫీల్ కలిగించే ఎక్స్‌ట్రా ప్రమోషనల్ స్టఫ్ కోసం కసరత్తు మొదలుపెట్టారు జక్కన్న. సెకండ్ ట్రయిలర్ రిలీజ్ చేసి, మోర్ అడ్వాంటేజ్ పొందిన భీమ్లా అండ్ రాధేశ్యామ్ సినిమాల స్ట్రాటజీ మీద కూడా ఓ కన్నేశారట. సినిమాలోని స్పెషల్ ఎలిమెంట్స్‌ని రీఇంట్రడ్యూస్ చేస్తూ కొత్తగా ఒక మినీ ట్రయిలర్‌ని రూపొందిస్తోంది ట్రిపులార్ టీమ్. చెర్రీ అండ్ అలియా మీద పిక్చరైజ్ చేసిన మరో పాటను కూడా దాచిపెట్టే వుంచారట. రిలీజ్‌డేట్‌కి వారం రోజుల ముందు జరిగే ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ఈ పవర్‌ఫుల్ స్టఫ్‌ని బైటికొదిలే ఛాన్సుంది. రాధేశ్యామ్ సందడి ముగిసి, ఒక్కసారి డార్లింగ్ క్యాంప్ అంతా రెస్ట్ జోన్‌లోకి చేరిపోతే… జక్కన్న టీమ్ లైమ్‌లైట్‌లోకొచ్చేస్తుందన్నమాట.
మరిన్ని ఇక్కడ చదవండి :