
ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన జీ20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆయన యావత్ భారతీయ సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించారు. అందులో తన ఆలోచనలను ప్రభావంతమైన రీతిలో వివరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే జీ20 వంటి ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొనడంపై బుధవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు రామ్ చరణ్. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
“G20 సమ్మిట్‌లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలను మన సినిమాల గొప్పతనాన్ని ప్రదర్శించే అవకాశం కృతజ్ఞుడను. అత్యంత సాపేక్ష కంటెంట్ ద్వారా విలువైన జీవిత పాఠాలను అందించగల సామర్థ్యంలో భారతీయ సినిమా ఒక ప్రత్యేకమైన రమణీయతను కలిగి ఉంది ” అంటూ ట్వీట్ చేశారు చరణ్. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జీ20 మార్గదర్శకుడు అమితాబ్ కాంత్ లకు ధన్యవాదాలు తెలిపారు చరణ్. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది
కాశ్మీర్‌లో ఫిల్మ్ టూరిజంను మెరుగుపరిచే అజెండా కోసం జరిగిన ఈ జీ20 సమ్మిట్ లో భారత దేశం తరపున ప్రాతినధ్యం వహించారు చరణ్. ఈ క్రమంలోనే తన హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు చరణ్.
I am truly grateful for the opportunity to showcase the richness of our rooted culture & mysticism through our films at the G20 Summit. Indian Cinema possesses a unique beauty in its ability to impart valuable life lessons through highly relatable content. @kishanreddybjp Garu… pic.twitter.com/IPBxu0Mi40
— Ram Charan (@AlwaysRamCharan) May 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.