Game Changer: గేమ్ ఛేంజర్ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు.. దగ్గరుండి చూసుకుంటున్న మెగా ఆర్గనైజర్లు

| Edited By: Rajeev Rayala

Jan 03, 2025 | 11:32 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది . ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా రీసెంట్ గా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ట్రైలర్ జనవరి 2 విడుదలైంది. SS రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేసి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Game Changer: గేమ్ ఛేంజర్ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు.. దగ్గరుండి చూసుకుంటున్న మెగా ఆర్గనైజర్లు
Game Changer
Follow us on

రాజమండ్రి వేమగిరిలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించిన అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవనం స్వామి నాయుడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్ భారీగా జరగనున్న నేపథ్యంలో అభిమానులంతా ఈ ఈవెంట్ కు తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు, ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా వేమగిరి 40 ఎకరాల విస్తీర్ణంలో రేపు(జనవరి 4న ) జరగనున్న మెగా ఈవెంట్ కు రాం చరణ్ తో పాటు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు గేమ్ చేంజర్ గొప్ప ఈవెంట్ గా రికార్డు సృష్టించ బోతుంది, లక్షలాది మందికి పైగా అభిమానులు తరలి రానున్నారన్నారు రవనం స్వామి నాయుడు…వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మెగా అభిమానులతో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు.

ఈవెంట్ వద్ద లక్ష మందికి సరిపోనప్పటికీ.. ఎవరికీ చెడ్డ పేరు రాకుండా అభిమానులందరం సభను విజయవంత చేయనున్నటున్నారు మెగా ఆర్గనైజర్లు..వేడుకకు రెండు కిలోమీటర్ల దూరంలో ఇరువైపులా భారీ కేట్లు ఏర్పాటు చేస్తున్నారు…ఎప్పటికప్పుడు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు…..చిత్ర పరిశ్రమ నుండి కూడా ప్రముఖులు కూడా ఈవెంట్ కు హాజరు కనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.