గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం (జనవరి 02)న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గ్లోబల్ స్టార్ నటన అద్దిరిపోయిందని, డైలాగులు కూడా బాగా పేలాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అలాగే అప్పన్న అనే రాజకీయ నాయకుడిగానూ అలరించనున్నాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఈ ట్రైలర్ నిదర్శనం. కాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సినిమా నిడివి 165.30 నిమిషాల (2:45 గంటలు) ఉండనున్నట్లు తెలిపింది.
గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి, ఎస్.జె. సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రా మచ్చా, నానా హైరానా, జరగండి, ధోప్ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక కొన్ని గంటల క్రితమే రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా నెక్ట్స్ లెవెల్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.
*_GAME CHANGER_* Censor Formalities Completed.. Movie Duration 2:45:30..📽️ #GameChangerTrailer drops today at 5:04 PM.
Stay tuned! 💥#GameChangerOnJAN10 🚁
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/HLcsXC4RrI
— Suresh Kondeti (@santoshamsuresh) January 2, 2025
మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు!! ✊🏼💥
You are in for the biggest game that you have ever seen!🔥Presenting the #GameChangerTrailer ❤️🔥
▶️https://t.co/Sy1N0nxVt5#GameChanger #GameChangerOnJAN10 🚁
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara… pic.twitter.com/dFMhSZYmHS— Sri Venkateswara Creations (@SVC_official) January 2, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .