టాలీవుడ్ లో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆర్ఆర్ ఆర్ సినిమాలో రామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత.. రామ్ చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి చెర్రీ హైడ్ లైన్స్ లో నిలిచాడు. , రామ్ చరణ్ బర్త్ డే తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. రేపు చెర్రీ 38 ఏట అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే చెర్రీ పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ప్రారంభించారు. ప్రస్తుతం Rc15 పేరుతో చరణ్ తాజా సినిమా సెట్స్‌లో టీమ్‌తో కలిసి కేక్ కట్ చేశాడు. ఈ వేడుకలకు కియారా అద్వానీ కూడా హాజరయ్యింది.
It’s a wrap for the song!! ??
Team #RC15 & #SVC50 kickstart Megapower Star @AlwaysRamCharan Birthday Celebrations. Stay tuned for more updates. @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/iBflT1Ap8D
— Sri Venkateswara Creations (@SVC_official) March 25, 2023
ఆర్‌సి 15లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కనిపించబోతోంది. సెట్‌లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలో ఆమె కూడా పాల్గొంది. ఈ సమయంలో ఫోటోలు Rc_15_love అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ నీలిరంగు షర్ట్, తెలుపు రంగు ప్యాంటులో హ్యాండ్ సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కియారా వైట్ టాప్ , జీన్స్‌లో కనిపించింది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
ఈ ఫోటోలలో చిత్ర దర్శకుడు ఎస్ శంకర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఉన్నారు. దీనితో పాటు, చిత్ర బృందంలోని మరికొందరు సభ్యులు కూడా ఉన్నారు. చిత్ర యూనిట్ సమక్షంలో రామ్ చరణ్ బర్త్ డే కేక్ కట్ చేశారు.
పూలతో అలంకరణ
రామ్ చరణ్ బర్త్ డే ఫంక్షన్ ను చిత్ర యూనిట్ సెట్ లో చాలా అందంగా జరిపినట్లు ఈ చిత్రాలను తెలుస్తుంది. పూలతో అలంకరించారు. ‘హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్’ పోస్టర్ ఉంది. RC 15 సినిమా యాక్షన్ డ్రామా గా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్క్కుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..