AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.. ఫ్యాన్స్ రచ్చ ..

RRR Movie Trailer in Telugu: డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్..

RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.. ఫ్యాన్స్ రచ్చ ..
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 09, 2021 | 5:04 PM

Share

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్… తారక్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‏లో ఉన్నాయి. అందుకు తగినట్టుగానే ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన వీడియోస్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ సెకండ్‌ వేవ్‌ తర్వాత కరోనా కాస్త గ్యాప్‌ ఇవ్వడంతో జక్కన్న శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఈరోజు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. అయితే కాసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏ను థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్‏లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయి. యుద్దాన్ని వెతుకుంటూ ఆయుధాలు అవే వస్తాయి అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రామ్ చరణ్, తారక్ విజువల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రైలర్ సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనుహ్యంగా కాసేపటి క్రితమే యూట్యూబ్ లో విడుదల చేశారు.

ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం అభిమానులు సందడి మొదలుపెట్టేశారు. థియేటర్ల ముందు తారక్, చరణ్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి బాణాసంచాలు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి మొదలైంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం థియేటర్ల వద్దకు భారీగా మెగా, నందమూరి అభిమానులు చేరుకుంటున్నారు. ఇక ట్రైలర్ దృశ్యాలను కొందరు నెటిజన్స్ ట్విట్టర్ ఖాతాలలో షేర్ చేస్తున్నారు.

Watch RRR movie Trailer in Telugu here:

Also Read: Ariyana Glory: అదిరిన అరియానా లేటెస్ట్ పిక్స్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. మరో ప్రాజెక్ట్‏కు చిరు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..

Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..

Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..