Rakul Preet Singh: ఫిట్‌నెస్‌కు ఎట్‌మోస్ట్ ప్రియారిటీ ఇచ్చే రకుల్ ప్రీత్ సింగ్.. ఏం తింటారో తెలుసా..? ఎంత తింటారో తెలుసా..? తెలియదు కదా..! కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మాత్రం కాస్త గట్టిగానే తింటున్నారు. డైనింగ్ టేబుల్ నిండేన్ని వెరైటీలు… చూస్తేనే కడును నిండే వంటకాలను లాగించేందుకు రెడీ అయిపోయింది ఈ చిన్నది.
కడుపు మాడ్చుకుని కసిగా వర్కవుట్లు చేసే ఈ బ్యూటీ ఇన్ని వంటకాలను రెడీ చేసి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయండంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోవడమే కాదు.. చీట్ డైట్ చేస్తున్న రకుల్ అంటూ అభిమానుల చేత ఫన్నీ కమెంట్లను కూడా చేయిస్తోంది. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్. హిందీ భాషల్లో సినిమాలను లైనప్ చేసింది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. అలాగే కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు2లో చేస్తుంది. ఇక బాలీవుడ్ లోనూ రకుల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :