Google: ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా వెతికిన తెలుగు సినిమాలివే.. టాప్‌-10లో ఏమేం ఉన్నాయంటే?

|

Dec 08, 2022 | 6:14 PM

2022 తుది దశకు చేరుకోవడంతో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ నెటిజన్లు అత్యధికంగా శోధించిన సినిమాల జాబితా విడుదల చేసింది. నెటిజన్లు ఎక్కువగా శోధించిన సినిమాల జాబితాను కేటగిరీల వారిగా రిలీజ్ చేసింది. 

Google: ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా వెతికిన తెలుగు సినిమాలివే..  టాప్‌-10లో ఏమేం ఉన్నాయంటే?
RRR
Follow us on

కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. చూస్తుండగానే 2022 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. మరికొన్నిరోజుల్లో 2023కు సాదర స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది సినిమా పరిశ్రమ. అయితే అదృష్టవశాత్తూ ఈ ఏడాది ఆ సమస్యలేమీ తలెత్తలేదు. ఏడాది ప్రారంభంలో కొవిడ్‌ కాస్త భయపెట్టినా అది కొన్ని రోజులకే పరిమితమైంది. దీంతో ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. ఓటీటీల ప్రభావం ఉన్నప్పటికీ సిల్వర్‌ స్ర్కీన్‌పైనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఈసారి సౌత్‌ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్‌ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. కాగా 2022 తుది దశకు చేరుకోవడంతో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ నెటిజన్లు అత్యధికంగా శోధించిన సినిమాల జాబితా విడుదల చేసింది. నెటిజన్లు ఎక్కువగా శోధించిన సినిమాల జాబితాను కేటగిరీల వారిగా రిలీజ్ చేసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌కే అగ్రతాంబూలం..

వరల్డ్‌వైడ్‌, నేషనల్‌ వైడ్‌, సౌత్‌ ఇండియా, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మల్లువుడ్.. ఇలా పలు కేటగిరిల్లో ఎక్కువ మంది గూగుల్‌లో వెతికిన సినిమాల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో టాప్‌-10 తెలుగు సినిమాలను ఒకసారి పరిశీలిస్తే.. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల ఆర్‌ఆర్‌ఆర్‌ మొదటి ప్లేస్‌లో నిలిచింది. అల్లు అర్జున్- సుకుమార్‌ల పుష్ప రెండో స్థానం దక్కించుకుంది. విజయ్‌ దేవర కొండ లైగర్‌ మూడో ప్లేస్‌లో ఉండగా, నిఖిల్‌ సిద్ధార్థ కార్తికేయ-2 నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ ఉంది. వీటితో పాటు టాప్‌-10 జాబితాలో ఏమేం ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

టాప్ – 10 తెలుగు సినిమాలివే..

1.ఆర్‌ఆర్‌ఆర్‌
2.పుష్ప – ది రైజ్‌
3.లైగర్‌
4.కార్తికేయ-2
5.రాధేశ్యామ్‌
6.సీతారామం
7.సర్కారువారిపాట
8.మేజర్‌
9.ఆదిపురుష్‌
10.శ్యామ్‌సింగరాయ్‌

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..