రాజమౌళి.. బడా హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ.. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ఎదిగారు. ఇప్పటివరకు రాజమౌళి రూపొందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగానే నిలిచింది. అందుకే ఈ దర్శకధీరుడితో కలిసి సినిమా చేసేందుకు అగ్రహీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయారు. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో.. భారీ మల్టీస్టారర్ మూవ ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. ఈ మూవీ కోసం అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా అడ్డు పడింది. దీంతో మూవీ షూటింగ్కు బ్రేక్ చెప్పిన చిత్రయూనిట్.. ప్రస్తుతం ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ టీం ఇంట్లో ఉన్నా కానీ.. ప్రస్తుతం దేశంలో కరోనా విపత్కర పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. అలాగే పలు సందేహాలపై.. చరణ్, తారక్.. ఇతర ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు.. క్లుప్తంగా ఓ వీడియోలో వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం రాజమౌళి కరోనా పరిస్థితులపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుత ఈ క్లిష్ట పరిస్థితులపై ఒక 19 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ వారి సహకారంతో తెరకెక్కించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ షార్ ఫిల్మ్ ను రాజమౌళి త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికి భారీ సినిమాలను రూపొందించిన రాజమౌళి నుంచి రాబోయే ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతుందో చూడాలి.