AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yami Goutham: పెళ్లిపీటలెక్కిన మరో టాలీవుడ్ హీరోయిన్ .. ఆ దర్శకుడిని వివాహం చేసుకున్న యామీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Yami Goutham: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ పెళ్లి పీటలెక్కింది. 'ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధార్‏తో మూడు ముళ్లు

Yami Goutham: పెళ్లిపీటలెక్కిన మరో టాలీవుడ్ హీరోయిన్ .. ఆ దర్శకుడిని వివాహం చేసుకున్న యామీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Yami Goutham
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2021 | 7:42 PM

Share

Yami Goutham: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ పెళ్లి పీటలెక్కింది. ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధార్‏తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది. కరోనా నిబంధనలను పాటిస్తూ.. కేవలం ఇరు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జూన్ 4న జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు వెల్లడించింది. అలాగే భర్తతో దిగిన ఫోటోలను షేర్ నెట్టింట్లో షేర్ చేసింది. దీంతో యామీ గౌతమ్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

Yami

Yami

ఇదిలా ఉంటే.. యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ఉల్లాస, ఉత్సహ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ‘విక్కీ డోనర్‌’తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్‌ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్‌ సరసన ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్’లో నటించింది. ప్రస్తుతం ఆమె ‘భూత్‌ పోలీస్‌’తో పాటు ‘దస్వి’, ‘ఎ థర్స్‌డే’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఆమె భర్త ఆదిత్యా.. విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో నటించిన ఉరి సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం విక్కీ నట్టించిన ది ఇమ్మెర్టల్ అశ్వత్థామ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Madras High Court: కారుణ్య నియామకంలో హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు.. మరణించిన వ్యక్తి ఉద్యోగానికి పోటీపడ్డ కోడలు, కూతురు..!

Juhi Chawla: 5జీ నెట్‏వర్క్ వివాదం.. నటి జూహీ చావ్లాకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. రూ.20 లక్షల జరిమానా..