Raj Tarun: అడిగితే సాయం చేస్తా.. ఇక అతకడం మాత్రం ఉండదంటున్న రాజ్ తరుణ్

లొల్లి నిజం. మరి పెళ్లి?! లావణ్య- రాజ్‌ తరుణ్‌ మధ్యలో మాల్వీ మల్హోత్ర... ట్రయాంగిల్‌ సహజీవన వివాద కథా చిత్రమ్‌లో కంప్లేంట్‌ చాప్టర్‌ మరో లెవల్‌. ఆమె ఫిర్యాదు చేస్తుందని ఈవిడకు తెలుసు.. ఈమె కంప్లేంట్‌ ఇస్తారని ఆవిడకు తెలుసు... ఆ ఇద్దరి పరస్పర కంప్లైంట్‌ల సంగతి ఆయనకు ముందే తెలుసు....సూన్‌ అతను కూడా కంప్లేంట్ ఇస్తాడనే ముచ్చట ఈ ఇద్దరికీ తెలుసూ... టోటల్‌గా ఫిర్యాదు చాటు ఇలాఖత్‌ కథ ట్విస్ట్‌ భరిత సినిమాను తలపిస్తోంది.

Raj Tarun: అడిగితే సాయం చేస్తా.. ఇక అతకడం మాత్రం ఉండదంటున్న రాజ్ తరుణ్
Raj Tarun, Lavanya, Malvi
Follow us

|

Updated on: Jul 07, 2024 | 7:10 PM

11 ఏళ్ల  లివ్‌ ఇన్‌ రిలేషన్‌ బీటలు వారి మ్యాటర్‌ నార్సింగ్‌ ఠానాకు చేరింది. అయితేనేం ఆమె పట్ల అతనికి గ్రాటిట్యూడ్‌ తగ్గలేదు..ఇక ఆమెకు అతనిపై ప్రేమ చెక్కు చెదరలేదు.. మ్యాటర్‌ చిరిగి చాటై పీక్స్‌కు చేరిన తరుణంలోనూ ఆ ఇద్దరి మన్‌ కీ బాత్‌ చూస్తే .. కొత్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

డ్రగ్స్‌..మస్తాన్‌ స్థాయితో  రిలేషన్‌ షిప్‌.. ఆపై టార్చర్‌..అవన్నీ భరించలేక  లావణ్య నుంచి తను దూరం జరగినాననేది రాజ్‌ తరుణ్‌ వెర్షన్‌. 11 ఏళ్ల  తమ సహజీవనానికి రాజ్‌ తరుణ్‌ కటీఫ్‌ చెప్పడానికి కారణం మాల్వీ మల్హోత్ర అనేది లావణ్య ఆరోపణ. ఇన్నాళ్లు లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉండి  ఇప్పుడు మోసం చేశాడని నార్సింగ్‌ పీఎస్‌లో కంప్లేంట్‌ ఇచ్చారామె. మాల్వీ మల్హోత్ర  ఆమె ప్యామిలీ నుంచి థ్రెట్‌ వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలు సరే ఆధారాలేవని నోటీసులు ఇవ్వడంతో  నార్సింగ్‌ ఠాణాకు వచ్చారామె. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ మాత్రమే కాదు తమకు పెళ్లయిందన్నారు.

జస్ట్‌ రిలేషన్‌ షిప్‌..అది కూడా కట్‌ అయి ఏడేళ్లయిందన్నారు రాజ్‌ తరుణ్‌. కానీ లేటెస్ట్‌గా ఫ్రేమ్‌లోకి వచ్చిన లావణ్య మాత్రం..ఔను మేమిద్దం పెళ్లి చేసుకున్నామన్నారు. సహజీవనం నిజమే కానీ ఆమెతో వేగలేక తన ఇంట్లోకి తానే వెళ్లిపోయాననన్నారు రాజ్‌ తరుణ్‌. మాల్వీ మల్హోత్ర తాను రిలేషన్‌షిప్లో ఉన్నామన్న లావణ్య ఆరోపణలు అవాస్తమన్నారాయన. కానీ తమ మధ్య గొడవలకు మాల్వీనే కారణమన్నారు లావణ్య.  ఐతే తనపై నిరాధార ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ మల్లోత్ర పోలీసులకు కంప్లేంట్‌ ఇవ్వడం మరో ట్విస్ట్‌.

రాజ్‌కు తనకు మధ్య గ్యాప్‌ రావడానికి  పెరగడానికి కారణం మాల్వీనే అన్నారు లావణ్య. వాళ్లిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందన్నారు.  లావణ్య ఆరోపిస్తున్నట్టుగా  ఆ ఇద్దరి మధ్య కుచ్‌ కుచ్‌  రిలేషన్‌ షిప్‌ కత వుందా?  మాల్వీ సైడ్‌ తీసుకున్న రాజ్‌ తరుణ్‌.. తనకు వార్నింగ్‌ ఇచ్చారని మరో సంచలనాన్ని తెరపైకి తెచ్చారు లావణ్య. మాన్వీతోనే కాదు మరికొందరితోనూ రాజ్‌ కు ఎఫైర్స్‌ ఉన్నాయన్నారు  లావణ్య. తమకు పెళ్లయిందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని.. తాను చెప్పాక వాళ్లు సైడయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాన్వీ కన్విన్స్‌ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు.

రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌ సహా రాజారవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య.  ఇప్పటికీ తన మనసంతా రాజ్‌ తరుణే అన్నారామె. కథ ఇందాక వచ్చాక ఇక కన్వీన్స్‌ అయ్యే ఛాన్సే లేదని క్లియర్‌ కట్‌గా చెప్పారు రాజ్‌ తరుణ్‌..  లీగల్‌గా ఫైట్‌  చేస్తానన్నారు. అడిగితే సాయం చేస్తేనే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదన్నారు.

ఇటు లావణ్య అటు మాల్వీ ఆ ఇద్దరి కంప్లేంట్స్‌ దాఖలు చేయపడినివి. ఇక నెక్ట్స్ రాజ్‌ తరుణ్‌ ఫిర్యాదు ఆన్‌ ది వే.  ట్విస్ట్‌ భరితంగా సాగుతోన్న సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ఇంకెన్ని మలుపులో.. మెరుపులో వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.