War 2: పెద్దగానే ప్లాన్ చూశారుగా.. వార్ 2లో మునుపెన్నడు చూడని సీక్వెన్స్..
2019లో విడుదలైన హృతిక్ రోషన్ చిత్రం 'వార్' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దాని రెండవ భాగం పనులు చాలా కాలంగా జరుగుతున్నాయి. 'వార్ 2'ని మరింత భారీగా తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు హృతిక్ ఈ సినిమాలో కబీర్ గా నటిస్తూ అలరిస్తుంటే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సంచలనం సృష్టించారు. దేవర సినిమా ఇప్పటికే కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసిన దేవర గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. 2019లో విడుదలైన హృతిక్ రోషన్ చిత్రం ‘వార్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దాని రెండవ భాగం పనులు చాలా కాలంగా జరుగుతున్నాయి. ‘వార్ 2’ని మరింత భారీగా తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు హృతిక్ ఈ సినిమాలో కబీర్ గా నటిస్తూ అలరిస్తుంటే, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు వీరిద్దరి సీక్వెన్స్‌కు సంబంధించిన సమాచారం బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..
నిజానికి వార్ 2 గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. దీంతో సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంతకుముందు పెద్దగా కనిపించని ఛేజింగ్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉండబోతోందని బీ టౌన్ లో టాక్. ఈ ఛేజింగ్ సీక్వెన్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉంటుందట.. ఇందులో హృతిక్ నగరంలోని రూఫ్‌టాప్‌లు, షార్ట్‌కట్ మార్గాల్లో ఎన్టీఆర్‌ని వెంబడిస్తున్నట్లు చూపించనున్నారని అంటున్నారు. ఒక బిల్డింగ్‌పై నుంచి మరో భవనంపైకి దూకడం, జారిపోవడం వంటి సన్నివేశాలు చాలా ఉంటాయట. ఈ ఛేజింగ్ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా టెక్నాలజీ సహాయం తప్పించుకుంటూ ఉంటారని అంటున్నారు. ఎందుకంటే అతని పాత్ర టెక్నాలజీని చాలా ఇష్టపడే వ్యక్తిగా ఉండబోతోందని అంటున్నారు.
ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!
అంతే కాదు ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరిగే ఫైట్‌తో ఛేజింగ్ సీక్వెన్స్ ముగుస్తుందని కూడా అంటున్నారు. ఓ ఎత్తైన భవనం పైన వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి ఆడియన్స్ లో చాలా కాలంగా బజ్ ఉంది. ఈ సినిమాలో వీరిద్దరితో పాటు కియారా అద్వానీ కూడా కనిపించనుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాత. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. వార్ తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.442 కోట్లు రాబట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.