Ram Charan: శరవేగంగా రామ్‌చరణ్ మైనపు విగ్రహా తయారీ.. ఏర్పాటు ఎప్పుడంటే..
రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కించుకున్న విషయం తెలిసిందే. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైనపు బొమ్మ తయారీ శరవేగంగా జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా మేడం టుస్సాడ్ ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు..
ట్రిపులార్‌తో ఒక్కసారిగా గ్లోబల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. మగధీరాతో ఇండియా వైడ్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రిపులార్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ రేంజ్‌కి ఎదిగిపోయారు.
ఇక తాజాగా రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎంతో గర్వంగా భావించే ఈ జాబితాలో చెర్రీ కూడా చేరడం విశేషం. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు.
భారతదేశానికి చెందిన ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు బొమ్మలను ఏర్పాటు చేయగా ఇప్పుడీ జాబితాలోకి రామ్ చరణ్ కూడా వచ్చి చేరారు. ఈ విషయాన్ని అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధితులు అధికారింగా ప్రకటించారు.
ఇప్పటికే రామ్ చరణ్‌తోపాటు ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ అరుదైన గౌరవం లభించడంపై రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మేడం టుస్సాడ్ ప్రతినిధులు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో తన మైనపు విగ్రహం పెట్టడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కలుద్దామని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..