Raashii Khanna: దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడక్కండి.. రాశి ఖన్నా అంతమాట అనేసిందేంటీ
ఎన్టీఆర్ లాంటి బడా హీరో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. మొన్నామధ్య హిందీలోకి కూడా అడుగుపెట్టింది. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ నటించిన షార్జా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఈ చిన్నది.
ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకున్న రాశి ఖన్నా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. ఈ చిన్నది ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేదు. ఎన్టీఆర్ లాంటి బడా హీరో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. మొన్నామధ్య హిందీలోకి కూడా అడుగుపెట్టింది. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ నటించిన షార్జా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో అంతగా సినిమాలు లేవు.. కొత్త బామలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే రాశీ మాత్రం మెల్లగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో అభిమానులకు కిర్రెక్కిస్తుంది. తనలోని గ్లామర్ యాంగిల్ ను బయట పెడుతూ రకరకాల ఫోటో షూట్స్ తో బిజీగా గడిపేస్తుంది. తన వయ్యారాలతో దర్శక నిర్మాతలకు గాలాలు వేస్తుంది ఈ చిన్నది. నటనతోనే కాదు అందాలతోనూ మెప్పిస్తానని ఈ ఫొటోలతో చెప్పకనే చెప్తుంది రాశి. ఈ చిన్నది మొన్నామధ్య ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.
ఇక ఇప్పుడు మరో తమిళ్ సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. అరణ్మణై 4 అనే సినిమాలో నటిస్తుంది రాశి ఈ సినిమాలో తమన్నా కూడా నటిస్తుంది. ఈ ఇద్దరూ పోటీపడి అందాలతో అదరగొట్టనున్నారు. ఇటీవల రాశి ఖన్నా మాట్లాడుతూ.. తనకు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలని ఉందని.. బాహుబలి లాంటి సినిమలో నటించాలని ఉంది అని తెలిపింది. అరణ్మణై 4 సినిమాలో తన పాత్ర మెప్పిస్తుందని తెలిపింది. అయితే పెళ్లి ప్రస్తావన రాగానే నైస్ గా తప్పించుకుంది. పెళ్లి గురించి మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అని అంటుంది రాశి ఖన్నా.
రాశి ఖన్నా ఇన్ స్టా..
View this post on Instagram
రాశి ఖన్నా ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.