AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayana Murthy: అలా చేసి ఉంటే పవన్‌ కల్యాణ్‌పై గౌరవం మరింతపెరిగేది: నారాయణమూర్తి

సుమారు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో ప్రతిష్ఠాత్మక గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించారు. దీనిపై సినీ ప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై నటుడు నారాయణమూర్తి స్పందించారు. అలాగే ఇటీవల ఏపీలో చర్చనీయాంశమైన మారిన థియేటర్ల బంద్ వ్యవహారంపై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Narayana Murthy: అలా చేసి ఉంటే పవన్‌ కల్యాణ్‌పై గౌరవం మరింతపెరిగేది: నారాయణమూర్తి
Pawan Kalyan, Narayana Murthy
Basha Shek
|

Updated on: May 31, 2025 | 1:48 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి శనివారం (మే31) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీలోనూ ఇలాంటి అవార్డులు ప్రకటించాలని నారాయణమూర్తి కోరారు. అలాగే ఇటీవల ఏపీలో చర్చనీయాంశమైన థియేటర్ల బంద్ వ్యవహారంపై కూడా పీపుల్స్ స్టార్ స్పందించారు. ‘గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది. అలాగే అవార్డుల విజేతలకు నా అభినందనలు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా నంది అవార్డులను ప్రకటించాలి. ఈ మధ్యన థియేటర్ల పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజిలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది. థియేటర్ల బంద్ అనేది బ్రహ్మాస్తం. సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది’

‘భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే విధానం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. పర్సంటేజిల విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్ లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజిల విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. పర్సంటేజి విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్ లకు వంతపాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. ఇప్పుడు సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుంది’ అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆర్ నారాయణమూర్తి ప్రసంగం.. వీడియో

ఇవి కూడా చదవండి..

Akhil Akkineni: అక్కినేని ఇంట మరో శుభకార్యం.. అఖిల్- జైనాబ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వేదిక ఎక్కడంటే?

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Pavala Shyamala: ‘సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు.. ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’.. దీన స్థితిలో పావలా శ్యామల