Allu Arjun: ఆ కమర్షియల్‌ యాడ్‌లో నటించేందుకు నో చెప్పిన బన్నీ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌..

Tollywood News: అల్లు అర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేక అవసరం లేదు.

Allu Arjun: ఆ కమర్షియల్‌ యాడ్‌లో నటించేందుకు నో చెప్పిన బన్నీ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌..
Allu Arjun

Edited By: Ravi Kiran

Updated on: Apr 20, 2022 | 9:59 AM

Tollywood News: అల్లు అర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేక అవసరం లేదు. సినిమా సినిమాకు తన పాపులారిటీని అమాంతం పెంచుకుంటున్న స్టైలిష్‌ స్టార్‌ మార్కెట్లో బ్రాండ్‌ వ్యాల్యూ కూడా మామూలుగా లేదు. అందుకే సినిమాలతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్నాడు. అయితే తాజాగా బన్ని తీసుకున్న ఓ నిర్ణయం పట్ల అటు అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్‌ (Allu Arjun) క్రేజ్‌ ను దృష్టిలో ఉంచుకుని ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ తన ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం అతడిని సంప్రదించిందట. ఇందుకు గాను కోట్ల రూపాయలను ఆఫర్‌ చేసిందట. అయితే మరో ఆలోచన లేకుండా ఆ పొగాకు ఉత్పత్తుల ప్రకటన( Tobacco Commercial Ad) లో నటించేందుకు నో చెప్పాడట బన్ని. పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అలాంటి ఉత్పత్తులను తాను ప్రమోట్‌ చేయనని సదరు కంపెనీ యాజమాన్యానికి తెగేసి చెప్పాడట. అంతేకాదు తాను అలాంటి యాడ్స్‌లో నటిస్తే, అభిమానులు కూడా పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడే అవకాశం ఉందని, అందుకే కోట్ల రూపాయల ఆఫర్‌ను మరో ఆలోచన లేకుండా తిరస్కరించాడట. దీంతో అతడి ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆరోగ్యం దృష్ట్యా బన్ని మంచి నిర్ణయం తీసుకున్నాడని సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక గతేడాది పుష్పతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన బన్నీ త్వరలో దీని సీక్వెల్‌ పుష్ఫ-2..ది రైజ్‌ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌ గా నటిస్తోంది.

Also  Read:Viral Video: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చి పక్కనే కుర్చున్న బస్సు డ్రైవర్.. చివరకు..

మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..