AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: జక్కన్నకు గాలం వేస్తున్న బాలీవుడ్ బాద్షా.. షారుక్ భారీ ప్లాన్

జీరో సైజ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బాలీవుడ్ బాద్షా షారుక్(Shah Rukh Khan). ఆల్రెడీ సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి.

Shah Rukh Khan: జక్కన్నకు గాలం వేస్తున్న బాలీవుడ్ బాద్షా.. షారుక్ భారీ ప్లాన్
Shahrukh Khan
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2022 | 9:58 AM

Share

జీరో సైజ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బాలీవుడ్ బాద్షా షారుక్(Shah Rukh Khan). ఆల్రెడీ సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. అవి కాకుండా లేటెస్ట్‌గా రాజ్‌కుమార్ హీరాణీతో డంకీ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు. బట్‌… ఇవన్నీ కాదు.. ఇంతకు మించి ఏదో కావాలంటూ జక్కన్న వైపు ఆశగా చూస్తున్నారట. ఆయన గోల్డెన్ డ్రీమ్‌ సాకారమయ్యే ఛాన్సున్నట్టా లేనట్టా..ఈగ సినిమా రిలీజైనప్పుడు రాజమౌళిని అభినందిస్తూ స్పెషల్‌గా ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్‌షా. థ్యాంక్యూ షారూఖ్ అంటూ రిటర్న్ మెసేజ్ పెట్టి… అప్పట్లో పొంగిపోయారు జక్కన్న. ఇది జరిగి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎలివేటైన రాజన్నతో కింగ్‌ఖాన్‌కి పెద్ద అవసరమే వచ్చి పడింది. కెరీర్‌ జీరో సైజ్‌కి పడిపోవడంతో ఒక్క హిట్టు ప్లీజ్ అంటూ దిక్కులు చూస్తున్నారు షారూఖ్‌ఖాన్. ఇప్పుడిప్పుడే పఠాన్ లాంటి బిగ్‌ టిక్కెట్స్‌ని టేకప్ చేశారు. లేటెస్ట్‌గా పీకే, మున్నాభాయ్, త్రిఇడియట్స్‌ లాంటి హిట్స్ ఇచ్చిన రాజ్‌కుమార్ హిరానీతో డంకీ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు.

కామెడీ, ఎమోషన్స్‌, రొమాన్స్… ఇలా అన్నీ ఫ్లేవర్స్‌కీ చోటుండే డంకీ సినిమా షారూఖ్‌కి మళ్లీ లైఫ్ ఇవ్వబోతోంది. అటు… ప్లాన్‌బీ అంటూ… కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కెప్టెన్సీలో ఒక సినిమా చేస్తున్నారు షారూఖ్‌ఖాన్. బ్రేక్ కోసం సౌత్ వైపు చూడ్డం కింగ్‌ఖాన్‌కి కొత్తేమీ కాదు. దీపికాతో కలిసి గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి… చాలా ఎడ్వాంటేజ్ పొందారు. లేటెస్ట్‌గా ట్రిపులార్‌తో బిగ్ బ్లాస్ట్ ఇచ్చిన రాజమౌళి మీదకి మళ్లింది షారూఖ్ వారి ఫోకస్. జక్కన్న చెయ్యబోయే మహాభారత్‌లో నాకూ పార్టిసిపేషన్ ఉండొచ్చు అని గతంలో ఓపెన్‌గా చెప్పుకున్న షారూఖ్.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆ జక్కన్నతో సినిమా కోసమే ఎఫర్ట్ పెడుతున్నారట. సల్మాన్ కోసం భజరంగీ భాయ్‌జాన్ లాంటి గొప్ప కథ రాసిచ్చిన విజయేంద్రప్రసాద్‌తో టచ్‌లోకొచ్చి… నాకూ ఓ కథ కావాలి… అని అప్పీల్ చేసుకున్నారట. మహేష్‌బాబుతో ఆల్రెడీ కమిట్‌మెంట్ ఉంది కనుక… ఆ తర్వాతి సినిమాను బాలీవుడ్ హీరోతో చేద్దామన్న ఆలోచన జక్కన్నది. సరిగ్గా ఇక్కడే బాద్‌షా ఐడియాలజీతో సింకవుతారని, షారూఖ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించే ప్రాజెక్ట్‌ వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుందని టాక్. కానీ.. జస్ట్ ఇమాజినేషన్ స్టేజ్‌లో వున్న ఈ క్రేజీ ప్రపోజల్‌ రియాలిటీకొస్తుందా రాదా అంటే… ఇట్స్ టూ ఎర్లీ టు సే అంటున్నారు బీటౌన్‌ పండిట్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

Follow Us
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
అద్భుతమైన ఫీచర్లతో వోల్వో EX90 ఎలక్ట్రిక్ కారు.. వివరాలు ఇవే
అద్భుతమైన ఫీచర్లతో వోల్వో EX90 ఎలక్ట్రిక్ కారు.. వివరాలు ఇవే