Pushpa 2 Movie: భారీ ఎత్తున పుష్ప 2 ఈవెంట్.. హైదరాబాద్‏లో ట్రాఫిక్ ఆంక్షలు..

|

Dec 01, 2024 | 5:32 PM

ఇప్పుడు అందరి చూపు పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ పైనే ఉన్నాయి. ఇన్నాళ్లు పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై అంటూ వరుస ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ అభిమానులకు దగ్గరకు వెళ్లిన అల్లు అర్జున్.. ఇప్పుడు హైదరాబాద్ ఈవెంట్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. దీంతో హైదరాబాద్‏లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Pushpa 2 Movie: భారీ ఎత్తున పుష్ప 2 ఈవెంట్.. హైదరాబాద్‏లో ట్రాఫిక్ ఆంక్షలు..
Pushpa 2 The Rule
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప 2 ఈవెంట్స్ నిర్వహించారు. ముంబై, కొచ్చి, చెన్నై, పాట్నా ప్రాంతాల్లో పుష్ప 2 స్పెషల్ ఈవెంట్స్ జరగ్గా.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇప్పుడు తెలుగు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 స్పెషల్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. పుష్ప వైల్డ్ ఫైర్ జాతర అనే పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు (డిసెంబర్ 2న) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వెనుక ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు చేయనున్నారు.

ఓపెన్ గ్రౌండ్ కావడం.. ఈవెంట్ భారీగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. దీంతో ఈ వేడుకకు ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధంచారు పోలీసులు. అటు వైపు వచ్చే వాహనాల దారులను మళ్లీస్తూ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి. పుష్ప 2ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కేవిబిఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇవే :

* జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కు వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లింపు..

* మైత్రివనం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు యూసుఫ్ గూడా బస్తి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా మళ్లింపు..

* మైత్రివనం నుండి బోరబండ వెళ్లే వాహనాలు కృష్ణకాంత్ పార్క్ మీద మోతి నగర్ వైపు మళ్లింపు..

* ఈవెంట్ కు వచ్చే వారికోసం మూడు చోట్ల పార్కింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేయనున్నారు. జానకమ్మ తోట సవేరా ఫంక్షన్ హాల్ మహమూద్ ఫంక్షన్ హాల్ లో ఫ్యాన్స్ వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.