ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. 2021లో విడుదలైన పుష్ప 1 సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాను అనౌన్స్ చేశారు. దాదాపు మూడేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. తొలి రోజే రికార్డ్ స్థాయిలో ఓపినింగ్స్ రాబట్టింది ఈ మూవీ. ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప మేనియానే కనిపిస్తుంది. విడుదలకు ముందే ఈ మూవీ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వందకోట్లు రాబట్టింది పుష్ప 2.
ఇక పుష్ప 2 వారం రోజులు తిరగకముందే రూ. 1000కోట్లు రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా అదిరిపోయింది అని రివ్యూ ఇచ్చారు. మొదటి రోజు పబ్లిక్ టాక్ లో అభిమానులు పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తగ్గేదే లే అంటూ తమదైన స్టైల్ లో రివ్యూలు ఇచ్చారు. అయితే పబ్లిక్ టాక్ లో ఓ అమ్మడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె పబ్లిక్ టాక్ లో ఏం మాట్లాడలేదు కానీ ఆమె చేసిన సైగలు, పుష్ప 2 యూనిక్ మేనరిజం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ అమ్మడే ట్రెండ్ .. పుష్ప సినిమా భారీ హిట్ అని చెప్పడానికి ఈ అమ్మడి రియాక్షన్ ఒక్కటి చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరంటే. ఆమె పేరు శివాని రాఘవన్. ఆమె ఓ మేకప్ ఆర్టిస్ట్. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ హైదరాబాదీ అమ్మాయి అల్లు అర్జున్ కు వీరాభిమాని. సోషల్ మీడియాలో శివానికి 14.1కే ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో భర్తతో కలిసి ఆమె షేర్ చేసే ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పుష్ప 2 పబ్లిక్ టాక్ తర్వాత ఆమె ఎవరు అని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ గాలించారు. దాంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.