Pushpa 2: కేశవ వచ్చేశాడు.. జైలు నుంచి బెయిల్‌పై బయటకు జగదీశ్‌.. పుష్ఫ 2 షూటింగ్‌లో జాయిన్‌

ఈ ఏడాది ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్‌ నటించిన పుష్ఫ 2 అని చెప్పువచ్చు. పాన్‌ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన పుష్ఫ సీక్వెల్‌ కోసం సౌత్‌తో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Pushpa 2: కేశవ వచ్చేశాడు.. జైలు నుంచి బెయిల్‌పై బయటకు జగదీశ్‌..  పుష్ఫ 2 షూటింగ్‌లో జాయిన్‌
Jagadeesh Prathap Bandari, Allu Arjun

Updated on: Feb 01, 2024 | 5:20 PM

 

ఈ ఏడాది ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్‌ నటించిన పుష్ఫ 2 అని చెప్పువచ్చు. పాన్‌ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన పుష్ఫ సీక్వెల్‌ కోసం సౌత్‌తో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేశారు మేకర్స్‌. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పుష్ఫ2 రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ స్నేహితుడు కేశవ్‌ పాత్ర పోషించిన జగదీప్‌ ప్రతాప్‌ భండారి ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య కేసులో జైలు కెళ్లాడు. గత డిసెంబర్‌లో జగదీష్‌ని అరెస్టు చేశారు. దీంతో పుష్ఫ 2 షూటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు జగదీష్‌కు బెయిల్ వచ్చిందని సమాచారం. అంతేకాదు ఆ వెంటనే ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌కి కూడా హాజరయ్యాడట. దీంతో పుష్ఫ 2 షూటింగ్‌ శరవేగంగా సాగుతోందట. మొదటి పార్ట్‌ కంటే ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో జగదీష్‌ నటించే సన్నివేశాలు చాలా ఉండడంతో బెయిల్‌ రాగానే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడట జగదీశ్‌.

ఇవి కూడా చదవండి

కాగా ‘పుష్ప 2’ బృందం జగదీష్‌కు బెయిల్ రావడంలో బాగా సహాయ పడిందట. ఇప్పుడు బెయిల్ రావడంతో హైదరాబాద్ లో గంగమ్మ జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులో జగదీష్‌ కూడా పాల్గొన్నాడట. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇటీవలే ‘పుష్ప 2’ విడుదల తేదీ మారుతుందని పుకార్లు వచ్చాయి. కానీ దానిని చిత్రబృందం ఖండించింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే స్పష్టం చేశారు. అదే తేదీన ‘పుష్ప 2’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పోస్టర్‌ను విడుదల చేశారు. ఆగస్ట్ 15న ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్‌, అనసూయ, డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

పుష్ఫ డైరెక్టర్ సుకుమార్ తో..

పుష్ఫ చిత్రబృందంతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి