Puri Jagannadh: నడుం బిగించిన పూరి.. ఆ సినిమా సీక్వెల్‌కు రెడీ అయిన డైనమిక్ డైరెక్టర్
డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్బ్ శంకర్ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్(Puri Jagannadh)దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్బ్ శంకర్ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను ఈ సినిమాతో మాస్ హీరోగా మార్చారు పూరి జగన్నాథ్. రామ్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు, అతని యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పూరి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఆ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పై దృష్టి పెట్టారట పూరిజగన్నాథ్.
అంతకన్నా ముందు విజయ్ తో జనగణమన అనే సినిమా చేస్తున్నారు పూరి. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఉంటోందట. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో పూరి ఇప్పటికే రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు. ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించిన లైన్ ను సెట్ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టినట్టుగా టాక్. మొదటి పార్ట్ కు మించి ఈ సినిమాలో మాస్ , యాక్షన్ ఎలిమేట్స్ ఉండేలా పూరి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తారా.. లేక మరోహీరోతో ఈ సినిమా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య తో సినిమా మెగాస్టార్ తో ఓ సినిమా చేయనున్నారు పూరిజగన్నాథ్.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి