AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: డబుల్ ఇస్మార్ట్ పై ఫోకస్ చేసిన పూరి.. మరీ చిరంజీవితో సినిమా ?..

ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్న చిరంజీవి, పూరీ జగన్నాథ్ సినిమా ఎందుకు మెటిరియలైజ్ అవ్వట్లేదు..? నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర దర్శకులకు కూడా చిరు ఆఫర్ ఇస్తున్నారు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి తనకోసమే చూస్తున్న పూరీని మాత్రం మెగాస్టార్ ఎందుకు పట్టించుకోవట్లేదు..? చిరంజీవి లిస్ట్‌లో పూరీ జగన్నాథ్ ఇంకా ఉన్నారా..? అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ ఇంకా ఆన్‌లోనే ఉందా లేదంటే హోల్డ్‌లోకి వెళ్లిపోయిందా..?

Megastar Chiranjeevi: డబుల్ ఇస్మార్ట్ పై ఫోకస్ చేసిన పూరి.. మరీ చిరంజీవితో సినిమా ?..
Chiranjeevi, Puri
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 09, 2023 | 9:19 AM

Share

ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్న చిరంజీవి, పూరీ జగన్నాథ్ సినిమా ఎందుకు మెటిరియలైజ్ అవ్వట్లేదు..? నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర దర్శకులకు కూడా చిరు ఆఫర్ ఇస్తున్నారు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి తనకోసమే చూస్తున్న పూరీని మాత్రం మెగాస్టార్ ఎందుకు పట్టించుకోవట్లేదు..? చిరంజీవి లిస్ట్‌లో పూరీ జగన్నాథ్ ఇంకా ఉన్నారా..? అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ ఇంకా ఆన్‌లోనే ఉందా లేదంటే హోల్డ్‌లోకి వెళ్లిపోయిందా..? 20 ఏళ్ళ కింద ఎంత వేగంగా సినిమాలు చేసారో.. ఇప్పుడలాగే చేస్తున్నారు చిరంజీవి. ఒకే ఏడాది రెండు.. కుదిర్తే మూడు సినిమాలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే దర్శకులను ఎంచుకుంటున్నారు. తాజాగా భోళా శంకర్ పూర్తి చేసి.. యుఎస్ ట్రిప్ వెళ్లారు చిరు. ఆగస్ట్‌లో కళ్యాణ్ కృష్ణతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టార్ట్ చేయబోతున్నారు చిరంజీవి. సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

రీ ఎంట్రీలో ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తున్న చిరు.. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమాకు సై అన్నారు. కళ్యాణ్ కృష్ణతో పాటు వశిష్టతోనూ ఓ సినిమాకు సై అన్నారు మెగాస్టార్. అయితే ఇది సోషియో ఫాంటసీ కావడంతో కాస్త టైమ్ పడుతుంది. వీటి మధ్యలో పడి పూరీ జగన్నాథ్‌తో సినిమా సైడ్ అయిపోయింది. గాడ్ ఫాదర్ తర్వాత పూరీతో సినిమాకు ఓకే అన్నారు చిరంజీవి. మంచి కథ ఉంటే చేద్దామని మాటిచ్చారు కూడా. పూరి కూడా కథ సిద్ధం చేసి చిరుకు చెప్పారు. అయితే అప్పటికే రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ లాక్ చేసారు పూరీ. దాంతో అది పూర్తి చేసాక.. చిరంజీవి సినిమాపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు పూరీ. ఇదే విషయాన్ని మెగాస్టార్‌కు చెప్పి డబుల్ ఇస్మార్ట్‌పై ఫోకస్ చేసారు పూరీ. ఈ లోపు కళ్యాణ్ కృష్ణ, వశిష్ట సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు చిరంజీవి. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత పూరీ లైన్‌లోకి రానున్నారు.

బోయపాటి స్కంద పూర్తైన తర్వాత డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు రామ్. మార్చ్ 8, 2024న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు ఆగస్ట్ నుంచి కళ్యాణ్ కృష్ణ, అక్టోబర్ నుంచి వశిష్ట సినిమాలు మొదలు పెట్టాలని చూస్తున్నారు చిరు. 2024 సమ్మర్ నాటికి తమ ప్రాజెక్ట్స్ నుంచి ఫ్రీ కానున్నారు పూరీ, చిరు. అప్పుడు ఈ కాంబోలో సినిమా ఊహించొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?