AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఇది సార్ ప్రభాస్ రేంజ్..! 200కోట్లు ఇవ్వడానికైనా సై అంటున్న నిర్మాతలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు

Prabhas: ఇది సార్ ప్రభాస్ రేంజ్..! 200కోట్లు ఇవ్వడానికైనా సై అంటున్న నిర్మాతలు
Prabhas
Rajeev Rayala
|

Updated on: May 16, 2025 | 10:32 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్, కల్కి హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాల పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షెడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలతో పాటు ప్రభాస్ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. స్పిరిట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తుంది. అలాగే హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకతంలోనూ ఓ సినిమా లైనప్ చేశాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓకే చేస్తున్నాడు ప్రభాస్.

వీటితో పాటు కల్కి 2, ప్రశాంత్ నీల్ సలార్ 2లోనూ నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడు. మొన్నటి వరకు రజినీకాంత్, దళపతి విజయ్ దాదాపు రూ. 100కోట్ల వరకు వసూల్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమాకు రూ. 150 కోట్లు అందుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ కు రూ. 200కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. ప్రభాస్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా భారీ ఓపినింగ్స్ అందుకుంటాయి. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే రాబడతాయి. దాంతో నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి, కల్కి సినిమాలు రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు