Jr.NTR: ఎన్టీఆర్‏కు బర్త్ డే విషెస్ చెప్పిన నిర్మాత.. ఫోటోస్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సైతం తారక్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోస్ చూసి అభిమానులు షాకవుతున్నారు. అసలేం జరిగిందంటే..

Jr.NTR: ఎన్టీఆర్‏కు బర్త్ డే విషెస్ చెప్పిన నిర్మాత.. ఫోటోస్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..
Jr.ntr, Skn

Updated on: May 20, 2025 | 3:17 PM

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీతారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ తారక్ కొత్త సినిమా అప్డేట్స్ సైతం షేర్ చేస్తున్నారు. తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన వార్ 2 టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలకు ఊహించి టీజర్ వదిలారు మేకర్స్. దీంతో మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. అందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్టింగ్ సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో హృతిక్, తారక్ మధ్య భయంకరమైన వార్ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

మరోవైపు నెట్టింట తారక్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత ఎస్కేఎన్ సైతం ఎన్టీఆర్ కు బర్త్ డే విష్ చెస్తూ ఫోటోస్ షేర్ చేశారు. ఇక ఆ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందులో ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపిస్తుంది. చేయి బెణికిందేమో.. అందుకే అలా పట్టీ వేసుకున్నాడా.. ? లేదంటే చేయి పట్టేసిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్కేఎన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు తారక్. ఇందులో రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే తెలుగులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్మిణీ వసంత్ కథానాయికగా కనిపించనుండగా.. త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి తారక్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి చిన్నపాటి గ్లింప్స్ అయినా వస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అప్సేట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..