Pawan Kalyan: పిఠాపురంలో నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సుజిత్ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం

ఏపీ ఎలక్షన్లలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడమే దీనికి కారణం. ఈనేపథ్యంలో పవన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ సెలబ్రిటీలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. తాజాగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, అలాగే ఓజీ డైరెక్టర్ సుజిత్ పిఠాపురంలో పర్యటించారు.

Pawan Kalyan: పిఠాపురంలో నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సుజిత్ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం
Pawan Kalyan, Producer Skn

Updated on: May 10, 2024 | 5:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. శనివారం (మే 11) సాయంత్ర ప్రచారానికి తెరపడనుండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. ఇక ఏపీ ఎలక్షన్లలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడమే దీనికి కారణం. ఈనేపథ్యంలో పవన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ సెలబ్రిటీలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. తాజాగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, అలాగే ఓజీ డైరెక్టర్ సుజిత్ పిఠాపురంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ గాజు గ్లాసుకు ఓటువేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. వీరికి తోడుగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పవన్‌ కల్యాణ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగ బాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్, సంపూర్ణేష్ బాబు, రామజోగయ్య శాస్త్రి తదితరులు పవన్ కు మద్దతు పలికారు. ఆయన భారీ మెజారిటీతో గెలవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

ఎన్నికల ప్రచారంలో బేబీ నిర్మాత ఎస్కేఎన్..

పిఠాపురంలో ఓజీ డైరెక్టర్ సుజిత్..

 

రామ జోగయ్య శాస్త్రి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.