AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మానందంగారు నటించకపోతే ఈ సినిమా తీయలేం.. నిర్మాత రాహుల్ యాదవ్

బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.. 1200 సినిమాల్లో నటించిన ఈ లెజెండరీ కమెడియన్ ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. నచ్చిన కథలు వచ్చినపుడో.. నచ్చిన మనషులు వచ్చి తప్పకుండా మీరు చేయాలి అని అడిగినపుడో తప్ప సినిమాలు చేయట్లేదీయన. కొన్నేళ్లుగా బ్రహ్మి చేస్తున్న సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయిందిప్పుడు.

బ్రహ్మానందంగారు నటించకపోతే ఈ సినిమా తీయలేం.. నిర్మాత రాహుల్ యాదవ్
Brahma Anandam Review
Rajeev Rayala
|

Updated on: Feb 08, 2025 | 5:11 PM

Share

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే?

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం’ టైటిల్ మాకు దొరకలేదు. ‘బ్రహ్మా ఆనందం’ అని చివరకు మార్చాను. మా టీంలోని కో డైరెక్టర్ వీరు ఆ టైటిల్‌ను డిజైన్ చేశారు. నా ప్రతీ సినిమాను సొంతంగానే నిర్మించాను. ఈ మూవీని కూడా నా బ్యానర్ మీదే సొంతంగానే తీశాను. ఎలాంటి కొలాబరేషన్ పెట్టుకోలేదు. తాత, మనవడు రిలేషన్, కథ నాకు బాగా నచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా తాత కూడా నన్ను సక్సెస్ ఫుల్‌గా చూడాలని అనుకున్నారు. కానీ మళ్లీ రావా టైంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు. మా తాత గారికి నివాళిలా ఈ సినిమా ఉంటుందని కథకు ఓకే చెప్పా.

బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే దర్శకుడు అప్రోచ్ అయ్యారు. బ్రహ్మానందం గారు నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ విన్న తరువాత బ్రహ్మానందం గారికి కూడా చాలా నచ్చింది. ఇంత వరకు ఆయన్ను చూడనటువంటి పాత్రల్లో, ఎమోషన్స్‌లో చూస్తారు. ప్రస్తుతం బ్రహ్మానందం గారు ఎక్కువగా సినిమాల్ని చేయడం లేదు. చాలా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటున్నారు. రంగమార్తాండ చూశాక ఆడియెన్స్‌ బ్రహ్మానందం గారిని చూసే కోణం మారిపోయింది. కమెడియన్ అంటే కేవలం నవ్విస్తారనే ముద్ర వేస్తాం. కానీ బ్రహ్మానందం గారు అద్భుతమైన నటులు. ఈ కథ నచ్చి బ్రహ్మానందం గారు వెంటనే ఓకే చెప్పారు.

హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. వెన్నెల కిషోర్ గారి పేరుని బ్రహ్మానందం గారు రికమండ్ చేశారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ పంపాం. ఆయన స్క్రిప్ట్ చదువుకున్నారు. హీరో బ్రహ్మా కారెక్టర్ కాకుండా.. ఫ్రెండ్ కారెక్టర్ గిరి బాగుంటుంది చేస్తానని వెన్నెల కిషోర్ గారు అన్నారు. ఆ తరువాత రాజా గౌతమ్ గారి పేరు చర్చల్లోకి వచ్చింది. కానీ అతను చేస్తే బాగుంటుందా?అని నాలో అనుమానం కలిగింది. కానీ రాజాని కలిసిన తరువాత అభిప్రాయం మారింది. అతని షేక్ హ్యాండ్ ఇచ్చిన విధానం నాకు చాలా నచ్చింది అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి