TOP9 ET: థియేటర్స్‌లో తండేల్ రాజు మాస్ జాతర.. కలెక్షన్స్ మోత
మోనాలిసా! మహా కుంభమేళాలో పూసలమ్ముకునే అమ్మాయి. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించాలనే టార్గెట్‌తో.. కుంభమేళాలో కష్టపడే అమ్మాయి. అలాంటి ఈ అమ్మాయి హీరోయిన్‌గా సినిమా చేసే స్థాయికి.. 21 లక్షలు సంపాదించే స్థాయికి వెళ్లింది. తన కుంభమేళా ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ బ్యూటీగా మారిన మోనాలిసా.. తన ఫస్ట్ సినిమాకు ఏకంగా 21 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకుంటుందట. అంతే కాదు సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్‌ను లోకల్‌గా పబ్లిసిటీ చేస్తూ దాదాపు 15 లక్షల వరకు వెనకేస్తుందట ఈ బ్యూటీ. దీంతో మోనాలిసా సంపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరిన్ని వివరాలు చూసేయండి
ఒక్క రోజు రూ.21 కోట్లు.. తండేల్ రాజ్ హవా…!
అడ్డు అదుపూ లేకుండా సముద్రం పొంగితే అది సునామి! అదే ఆగకుండా జనాలు థియేటర్ బాట పడితే.. అది తండేల్ సునామి! ఇప్పుడు దీన్నే క్రియేట్ చేశాడు తండేల్ రాజు. అప్పుడే ముదురుతున్న ఎండలకు.. తన సినిమాతో చెక్ పెట్టాడు. బుజ్జితల్లితో తాను కొనసాగించిన భావోద్వేగాల జర్నీలో సగటు ప్రేక్షకులను భాగస్వామ్యం చేశాడు. ఎమోషనల్ టాక్ తో పాటు.. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకున్నాడు. అంతేకాదు డే1 వరల్డ్ వైడ్ ఏకంగా 21 . 27 కోట్లను కొళ్లగొట్టాడు తండేల్ రాజ్.
పొరపాటున ట్వీట్ చేశాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు..
అప్పుడు ఆగలేకనో.. లేక పొరపాటునో మన సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తారు. ఆ ట్వీట్‌లో తాము పని చేసే సినిమా గురించి పంచుకుంటారు. కానీ అదే ఆ తర్వాత పెద్ద లీక్‌గా మారిపోవడంతో తలపట్టుకుంటారు. ఇక రామ్ చరణ్ ఆర్సీ 16 సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రత్న వేల్.. అదే చేశాడని చెప్పలేం కానీ.. అలాంటిదే ఓ పని చేశాడు. రాత్రిళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్స్, పవర్ క్రికెట్ , డిఫెరెంట్ యాంగిల్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ ఆధారంగా కొంత మంది ఆర్సీ16 సినిమా స్టోరీని ప్రిడిక్ట్ చేసేశారు. రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ పోటీనే ఆర్సీ16 సినిమా అంటూ ఇదే ఈ సినిమా స్టోరీ పాయింట్ అంటూ.. నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
